18-11-2025 12:16:44 AM
-అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ సంచలన తీర్పు
-‘బంగ్లా’ నిరసనకారులను చంపాలని ఆమె ఆదేశాలిచ్చినట్లు నిర్ధారణ
-హింసను నిలువరించేందుకు చర్యలు తీసుకోలేదని తేల్చిన ఏటీసీ
-రాజకీయ ప్రేరేపిత తీర్పు: మాజీ ప్రధాని షేక్ హసీనా
ఢాకా, నవంబర్ 17: మాజీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఢాకాలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ) మరణ శిక్ష విధించడం సంచలనం రేపింది. దేశాధ్యక్షురాలిగా కొనసాగిన సమయంలో ఆమె మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని ట్రిబ్యునల్ నిర్ధారిస్తూ, ఆమెను దోషి గా పేర్కొంటూ సోమవారం తీర్పునిచ్చింది. నిరసనకారులను చంపాలని ఆదేశించడం, వారికి న్యాయం జరగకుండా అడ్డుకోవాలని చూడటం, హింసను నిలువరించేందుకు ప్రయత్నించకపోవడం వంటి మూడు ప్రధా న అభియోగాలపై కోర్టు ఆమెను బాధ్యురాలిగా తేల్చింది.
నిరసనకారులను మట్టుపె ట్టేందుకు అత్యాధునిక డ్రోన్లను వినియోగించాలని, ఆయుధాలను ప్రయోగించాలని ఆ మె సూచించినట్లు కోర్టు నిర్ధారణకు వచ్చిం ది. అలాగే నాటి హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌కూ మరణ శిక్ష విధించ గా, మాజీ పోలీస్ చీఫ్ చౌదరి అల్-మాము న్‌కు క్షమాపణ కోరారు. దీంతో కోర్టు నుంచి అసదుజ్జమాన్‌కు ఉపశమనం కల్పించింది. గతేడాది బంగ్లాదేశ్‌లో జూలైలో విద్యార్థుల నేతృత్వంలో నాటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే.
ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆ మె అనేక హత్యలు, ఇతర అఘాయిత్యాలకు యంత్రాంగాన్ని ఆదేశించారని ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలోనే ఆమె పదవీచ్యుతురాలై దేశాన్ని వీడి, భారతదేశంలో తలదా చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని అక్కడి ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరింది. ఏటీసీ తాజాగా హసీనాకు మరణదండన విధించింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగశాఖ స్పందించింది. బంగ్లాదేశ్ పౌరులకు మంచి జరిగేలా తాము చర్యలు తీసుకుంటామని, దీనిపై కసరత్తు చేస్తామని ప్రకటించింది.
నన్ను బలిపశువును చేశారు: షేక్ హసీనా
తనకు ఏటీసీ మరణ శిక్ష విధించడంపై షేక్ హసీనా తీవ్రంగా స్పందించారు. తీర్పు కేవలం రాజకీయ ప్రేరేపిత చర్య అని ఆరోపించారు. న్యాయస్థానం పక్షపాత ధోరణి అవలంబించి తీర్పు వెలువరించిందని వాపోయారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. న్యాయస్థానం కనీసం తమ వాదన వినేందుకైనా అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. తాత్కాలిక మహ్మ ద్ యూనస్ ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రపంచ దృష్టిని మరల్చడానికే తనతోపాటు తమ పార్టీ ‘అవామీ లీగ్’ను బలిపశువును చేశారని పేర్కొన్నారు. న్యాయస్థానం ఇప్పటికైనా నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
జీవిత నేపథ్యం
నాటి తూర్పు పాకిస్థాన్‌లోని తుంగిపారాలో 1947 సెప్టెంబర్ 28న షేక్ హసీనా జన్మించారు. తండ్రి షేక్ ముజిబూర్ రెహమాన్ ఆ దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీల కంగా వ్యవహరించారు. తద్వారా జాతిపితగా నిలిచిపోయారు. ఢాకా విశ్వవిద్యాల యం నుంచి బెంగాలీ సాహిత్యంలో హసీనా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలోనే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొ న్నారు. 1968లో అణు శాస్త్రవేత్త ఎంఏ వాజెద్‌మియాను పెళ్లి చేసుకున్నారు.
రాజకీయాలకు భిన్నంగా ఆయన విద్యావేత్తగా నిరాడంబర జీవితం గడిపారు. 2009లో ఆయన మరణించే వరకు ఆమెకు తోడుగా ఉన్నారు. వారికి సజీబ్ వాజెద్ జాయ్ అనే కొడుకు, సైమా వాజెద్ పుతుల్ అనే కూతు రు ఉన్నారు. 1975 ఆగస్టులో జరిగిన సైనిక తిరుగుబాటు హసీనా జీవితంపై ప్రభావం చూపింది. నాడు ఆమె తన తండ్రి ముజిబూర్ రెహమాన్, తల్లి, ముగ్గురు సోదరుల తోపాటు మరికొందరు కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు.
సోదరి రెహానా విదేశంలో ఉండడటం వల్ల ఆమె బతికి బయట పడ్డారు. హసీనాకు నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఆశ్రయమిచ్చారు. ఆరు సంవత్సరాల తర్వాత 1981 మేలో బంగ్లాదేశ్‌కు హసీనా తిరిగొచ్చారు. దేశానికి రాక ముందే ఆమెను అవామీ లీగ్ పార్టీ తమ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకుం ది. అనేక సంవత్సరాల పాటు ఆమె దేశప్రధానిగా సేవలందించారు.