calender_icon.png 28 September, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రేజ్ కోసమే టీజర్‌లో ఆ డైలాగులు పెట్టాం

28-09-2025 01:28:58 AM

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కే హాస్య మూవీస్, రుద్రాంష్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ కాగా నరేశ్ వీకే, సాయికుమార్, వెన్నెల కిషోర్ వివిధ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రబృందం ‘ర్యాంప్‌మీట్’ పేరుతో శనివారం హైదరాబాద్‌లో మీడియాతో సమావేశమైంది.

ఈ ప్రెస్‌మీట్‌లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడు తూ.. “మా దర్శకుడు జైన్స్ నాని, నేనూ ఈ జర్నీలో స్నేహితులమయ్యాం. తను కథ చెబుతున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నా. ఈ సినిమాలో నేను చిల్లరగా ఉంటా.. యుక్తి క్యారెక్టర్ పిచ్చిది. వీళ్లిద్దరు కలిస్తే ఎంత ఫన్ క్రియేట్ అవుతుందో థియేటర్లలో చూస్తారు. ఇలాంటి పిచ్చి గర్ల్‌ఫ్రెండ్ ఉంటే చూసేవాళ్లకూ బూతులు వస్తాయి. ఇటీవల విడుదలైన టీజర్‌లోని ఒకట్రెండు డైలాగులు చూసి సినిమాపై ఓ అభిప్రాయానికి రావొద్దు. క్రేజ్ క్రియేట్ చేసేందుకే ఆ ఎలిమెంట్ (టీజర్‌లోని అభ్యంతరకర పదాలను ఉద్దేశించి)ను ప్రమోట్ చేస్తున్నాం” అన్నారు. హీరోయిన్ యుక్తి తరేజా మాట్లాడుతూ.. “కిరణ్ నా బెస్ట్ కోస్టార్ అని చెబుతాను. ‘క’తో కిరణ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ‘

కే ర్యాంప్’తో ఆ సక్సెస్ కంటిన్యూ చేయబోతున్నారు” అన్నారు. డైరెక్టర్ జైన్స్ నాని మాట్లాడుతూ.. “కే ర్యాంప్’ అంటే బూతు మాట కాదు. కే ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం ర్యాంప్. సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు కుమార్. అది దృష్టిలో పెట్టుకునే కథ రాశాను. థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు కూడా కిరణ్ అబ్బవరం ర్యాంప్ అనే అనుకుంటారు” అని చెప్పారు. నిర్మాత రాజేశ్ దండా మాట్లాడుతూ.. ‘కే ర్యాంప్ కథ విన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. మా సంస్థలో మరో ఎంటర్‌టైనర్ అని ఫిక్స్ అయ్యా. ఈ దీపావళికి పోటీ ఎంత ఉన్నా మా సినిమా సక్సెస్‌పై పూర్తి నమ్మకంగా ఉన్నాం” అన్నారు. నటుడు నరేశ్, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్, రచయిత రవి,  బ్రహ్మ కడలి, చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.