01-06-2025 12:00:00 AM
ఇప్పుడసలే పెళ్లిళ్ల సీజన్. హాల్డీ ఫంక్షన్ల జోరు, ఫొటో షూట్‌లు.. ఇలా ప్రతిదీ ఒక మధురమైన అనుభూతిని మిగులుస్తున్నది పెళ్లి వేడుక. పెళ్లి అనగానే ఆభరణాలు, వస్త్రధారణ ఒక ముఖ్యమైన భాగం. పెళ్లి వేడుకలో, హాల్దీలో మెరవాలంటే ట్రెండ్‌కు అనుగుణంగా డ్రెస్సింగ్ స్టుల్ ఉండాలి. అయితే ప్రతి సీజన్‌లో రకరకాల ట్రెండ్‌లు వస్తుండటంతో, ఏది అనుసరించాలో, ఏది వదిలివేయాలో? అనే గందరగోళం తప్పదు. ఈ నేపథ్యంలో పెళ్లి సందడిలో హుందాగా.. కుందనపు బొమ్మలా మెరవాలంటే మాత్రం కింది పార్టీ వేర్‌లను ట్రై చేసి చూడండి..
జస్ట్ డ్రెస్సింగ్ మాత్రమే కాదు.. ట్రెండ్‌కి తగ్గ ఆభరణాలతో మెరవాలి. పలు రకాల లెంగ్త్ ఉన్న చైన్ పెండెంట్‌లను లేయర్‌లాగా ధరించవచ్చు. లేదా ఒకే వైపు పలు బ్రేస్‌లెట్‌లను ఒకటిగా పేర్చవచ్చు. ఆల్ పీసెస్ రంగులు కలిసి కనబడేలా చూసుకోవడమే కీలకం. ఇవి ఒక సాధారణ ట్రెండింగ్.
ఏదైనా భారతీయ ఆభరణాల శైలిలో జడౌ నెక్లెస్ ధారణ తరతరాల వారసత్వంగా వస్తోంది. పూర్వ కాలంలో చాలా ఆభరణాలు మొఘల్ ఇతివృత్తంలో ప్ర భావితమయ్యాయి. అయితే ప్రస్తు తం ఆధునిక ఆభరణాల తయారీ లో పురాతన పద్ధతుల్లో ఏదైనా ఒక దానిని జత కలపడం ఒక ప్రత్యేకమైన కొత్త సంప్రదాయంగా మారింది. ఆ విధంగా జడౌ నెక్లెస్‌కు ఆదరణ పెరిగింది.
ఆడపిల్లల్ని ఆకట్టుకునే లంగా ఓణీల్లో బోలెడన్నీ ఫ్యాషన్లు. అయితే ఒకప్పుడు పట్టుతోనే అలరించే లంగా ఓణీ.. ఈ ఏడు మెరుపుల డోలా సిల్క్ క్లాత్‌తో మార్కెట్లోకి వచ్చింది. రంగురంగుల్లో పిఛ్‌వాయీ నుంచి కలంకారి వరకూ ఎన్నెన్నో ప్రింట్ల డిజైన్లతో సరికొత్తగా కనువిందు చేసింది.
వెరైటీ లుక్కులో ట్రెడిషనల్ ఇంకా స్టులిష్ కాంబోతో వస్తే ఎవరికి మాత్రం నచ్చ కుండా ఉంటుంది. అందుకే పండుగలూ, పెళ్లి వేడుకలప్పుడు విపరీతంగా మెరిసి ఈ ఏడు దుమ్ము రేపేసిందంటే నమ్మండి. ఇవే కాదు.. కనువిందు చేసే డిజైన్లతో హాఫ్ షోల్డర్, నెటెడ్ ఎంబ్రాయిడ రీ బ్లౌజులూ, వన్ మినిట్, ఇన్ స్టా శారీలూ అమ్మాయిల్ని ఎంతగా నో అలరించాయి!