17-06-2025 12:00:00 AM
రవితేజ.. ఇప్పుడు తన 76వ చిత్రం కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ‘ఆర్‌టీ76’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. ఈ చిత్రం సోమవారం సెట్స్‌పైకి వెళ్లింది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో షూటింగ్ జరిగింది.
రవితేజ, ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రవితేజ ఈ సినిమా కోసం చాలా స్టులిష్‌గా మేకోవర్ అయ్యారు. 2026 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: ప్రసాద్ మురెళ్ల; ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్; ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్.