calender_icon.png 24 January, 2026 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేకానంద హైస్కూల్‌లో భక్తిశ్రద్ధలతో వసంత పంచమి వేడుకలు

24-01-2026 12:00:00 AM

సరస్వతీ మాత ఆశీస్సులతో అక్షరాభ్యాసం చేసిన చిన్నారులు

వేములవాడ, జనవరి 23,(విజయక్రాంతి)వేములవాడ పట్టణంలోని వివేకానంద హైస్కూల్లో వసంత పంచమి పర్వదినాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జ్ఞానాధిదేవత సరస్వతీ మాత జన్మదినాన్ని పురస్క రించుకొని పాఠశాల ఆవరణలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.వేడుకలలో భాగం గా సరస్వతీ దేవి చిత్రపటానికి పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు ప్రత్యేక పూజ లు, హారతులు నిర్వహించారు.విద్యాభ్యాసానికి అత్యంత శుభదినంగా భావించే వసంత పంచమి సందర్భంగా చిన్నారుల కోసం సా మూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏర్పా టు చేశారు.

తల్లిదండ్రుల సమక్షంలో చిన్నారులు బియ్యంపై అక్షరాలు దిద్దుతూ ఓంకార నాదంతో అక్షర లోకంలోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమం హాజరైన వారిని ప్రత్యేకంగా ఆకట్టుకుంది.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గడీల ప్రసాద్ మాట్లాడుతూ, విద్యతోనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువు లో రాణించాలని సూచించారు.

అమ్మవా రి కృప అందరికీ ఉండాలని కోరారు.ప్రిన్సిపల్ గడీల సృజన మాట్లాడుతూ వసంత పంచ మి ప్రాముఖ్యతను వివరించి,విద్యార్థి జీవితంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొ న్నారు.ఈ కార్యక్రమంలో పారువెళ్ల వెంకటేశ్వర్లు,గుండ లావణ్య, అధ్యాపక బృం దం, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు ప్రసాద వితరణ చేశారు.