calender_icon.png 26 May, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్‌లో దుకాణాల్లో చోరీ

08-05-2025 12:00:00 AM

మేడ్చల్ : మేడ్చల్ పట్టణ పరిధిలో మా ర్కెట్లో ఉన్న రెండు  దుకాణాల్లో మంగళవా రం అర్ధరాత్రి దొంగతనం జరిగింది.  మనీష్ ట్రేడర్స్, అగర్వాల్ ట్రేడర్స్ దుకాణాల్లో షట్టర్లను పైకి లేపి లోనికి ప్రవేశించి క్యాష్ కౌం టర్ లో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. అగర్వా ల్ ట్రేడర్స్ నుంచి రూ. 2 లక్షలు, మనీ స్టేడర్ నుంచి రూ. 35 వేలు దొంగిలించారు.

బుధవారం ఉదయం  ఏ సి పి శ్రీనివాస్ రెడ్డి, సి ఐ సత్యనారాయణ, డి ఐ సుధీర్  కృష్ణ దొం గతనం జరిగిన తీరును పరిశీలించారు. దొం గలను పట్టుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించారు.  ఈ రెండు దుకాణా లకు ఉన్న షట్టర్లకు సెంటర్ లాక్ లేకపోవడంతో దుండగులు సునాయాసంగా  పైకి లేపి, లోపలికి ప్రవేశించగలిగారు.