27-10-2025 02:15:59 AM
అవార్డును అందజేసిన వెంకయ్యనాయుడు
హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాం తి): భూమి హక్కుల సంస్కర్త, న్యాయ నిపుణులు, రెతు న్యాయవాది ఎం.సునీల్ కుమార్ (భూమి సునీల్)కు ‘భూమి రత్న’ పురస్కారం వరించింది. రైతుల భూమి హక్కులు, గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ సాధికారతకు ఆయన అందించే విస్తృత సేవలకు ఈ గౌరవం లభించింది. హైదరాబాద్‌లో రైతు నేస్తం, ముప్ప వరపు ఫౌండేషన్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ‘భూమిరత్న’ అవార్డును మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు అందజేశారు.
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన సునీల్ 20 ఏళ్లుగా భూ సంస్కరణలు, గ్రామీణ చట్టపరమైన సాధికారత, వ్యవసాయ చట్టా లు, విధానాల రూపకల్పనలో విశేష సేవలందిస్తున్నారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో రాష్ర్ట లీగల్ కో-ఆర్డినేటర్‌గా పనిచేసిన సమయంలో ఆయన నేతృత్వంలో అమలు చేసిన కమ్యూనిటీ పారా లీగల్ ప్రోగ్రాం ద్వారా 10 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలు తమ భూములపై హక్కులు పొందగలిగాయి.