02-05-2025 01:13:46 AM
గజ్వేల్, మే 1: దేశవ్యాప్తంగా జనగణన తో పాటు కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల గజ్వేల్ బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి పట్టణ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్, బీసీ మోర్చా అధ్యక్షులు దువ్వల రాజు యాదవ్ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా దేవులపల్లి మనోహర్ యాదవ్, బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గ ర్నేపల్లి కృష్ణమూర్తి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనగణన తో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచడంతో పాటు చట్టసభల్లో బీసీలకు అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమన్నారు.
ప్రజాభిప్రాయం మేరకు, సామాజిక సమరసతను దృష్టిలో ఉంచుకుని జనగణనలో భాగంగా కులగణన చేయాలని నిర్ణయించడం గొప్ప నిర్ణయమన్నరు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలేదన్నారు. అధికారం లేనప్పుడు బీసీల పేరుతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కుల గణన పేరుతో స్వార్థ పూరిత రాజకీయాలకు తెరలేపాయన్నారు.
కానీ, ప్రజాప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి సుమతి, బిజెపి సీనియర్ నాయకులు నాగు ముదిరాజ్,
నాయిని సందీప్, మాడ్గురి నరసింహ ముదిరాజ్, వడ్డేపల్లి ప్రసాద్, మైస విజయ్, సూర్యారావు, కాళ్ల సాయి, ఆనంద్, సంగిపు అనిల్, గోపాల్, ఏలేశ్వరం ఎల్లం, అరుణ్, రాజేశ్వర్ చారి ఓబిసి, మహిళ, ఎస్సి మోర్చాల అధ్యక్షులు దువ్వల రాజు యాదవ్, కుంకుమ రాణి, గడ్డమీది ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.