calender_icon.png 4 October, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గాంధీ జయంతి

04-10-2025 01:15:31 AM

నివాళులు అర్పించిన ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్

ముషీరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ లోని అభ్యు దయ హై స్కూల్ సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బీజేపీ శ్రేణులు గాంధీ జయంతి మాజీ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయు ల జయంతులను పురస్కరించుకొని, స్వాతం త్ర సమరయోధులుగా మన దేశానికి, ప్రజలకు వారి అందించిన సేవలను కొనియా డారు. ఈ ప్రత్యేక రోజును పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు విదేశీ వస్తువులు నిషేధించి, స్వదేశీ వస్తులను వాడాలని ప్రతి ఒక్కరు ఈ ప్రత్యే క రోజున ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేయాలని తద్వరా స్వదేశీ కీర్తి ప్రతిష్టలు ముర్తి భవించేందుకు దోహదపడతాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రా బాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు పూస రాజు, డివిజన్ అధ్యక్షులు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, దామోదర్, వీఎస్టీ రాజు, కృష్ణ ప్రసాద్, ఎం. ఉమేష్, వాణి శాస్త్రి, సురేష్ రాజు, శ్రీనివాస్ యా దవ్, మదన్మోహన్, ఆనంద్ రావు, లక్ష్మణ్ యాదవ్, నీరజ్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, సంపత్ యాదవ్, రాజ్ కు మార్, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.