20-06-2025 05:29:21 PM
క్రైమ్ తగ్గించానికే సీసీ కెమెరాలు..
యువతకి వాలీబాల్ కిట్ పంపిణీ..
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయగూడెం గ్రామం పెద్ద గ్రామపంచాయతీ ఎక్కువగా క్రైమ్ బుట్టాయిగూడెం గ్రామం నుంచే వస్తుందనే ఆలోచనతో బుట్టాయిగూడెం గ్రామంలోని ప్రధాన రహదారిపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర చాల కీలకమని, మీ పరిసర ప్రాంతాలలో ఇవి ఏర్పాటు చేసుకోవడం వలన అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు, సహాయపడుతయని, నేర పరిశోధనలలో కనిపించని నాలుగవ సింహంలా ఉంటాయని ప్రమాదాలు చేసి పారిపోయే వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకమని, సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు వచ్చి ప్రతి గ్రామంలో, ప్రధాన కూడల్లలో, కిరాణ షాపుల ముందు సీసీ కెమెరాలు ఎర్పాటు చేయడాని, మండల ప్రజలు, యవత, వ్యాపారస్తులు సహకరించాలని తెలిపారు.
అనంతరం యువతకి వాలీబాల్ కిట్ పంపిణీ:
కన్నాయిగూడెం మండల కేంద్రంలో శుక్రవారం రోజున గూర్రేవులా గ్రామంలో యవతకు వాలీబాల్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలతో పాటు చదువులో రాణించాలన్నారు. మత్తుకు బానిసై తమ బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్ లాంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, చదువుపై దృష్టి సారించి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ముందుకు సాగుతూ స్వామి వివేకానంద లాంటి మహత్ములను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలను అవరోధించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు.