20-01-2026 02:05:04 AM
సిద్దిపేట పట్టణ రాజకీయాల్లో వేడి
ఇప్పట్లో సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు లేనట్టే
ముమ్మరమైన ఆశావాహుల ప్రచారం
సిద్దిపేట, జనవరి19 (విజయక్రాంతి): సిద్దిపేట మునిసిపల్ ఎన్నికలు నిజంగానే జరగబోతున్నాయా? లేక ప్రజాస్వామ్య ప్రక్రియను వాయిదా వేయడమే ప్రభుత్వ ఉద్దేశ మా? గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మునిసిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న ప్రకటనలతో సిద్దిపేట పట్టణ రాజకీయ ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే గడువు ముగిసిన మున్సిపాలిటీలకే ఎన్నికలు అని ఆ శాఖ మంత్రి స్పష్టంగా వెల్లడించినప్పటికి సిద్దిపేట విషయంలో మా త్రం అనుమానాల మబ్బును మరింత ద ట్టం చేసింది. గడువు ఇంకా ముగియని సిద్దిపేట మునిసిపాలిటీలో ఎన్నికలు ఉండవని అధికారులు చెబుతుంటే, మరోవైపు సోషల్ మీడియాలో రిజర్వేషన్ల పేరిట పాత జాబిత రిజర్వేషన్లు వైరల్ అవుతూ ఆశావాహులను ఊహాగానాల ఊబిలో ముంచేస్తున్నాయి.
ప్రస్తుతం సిద్దిపేట మునిసిపాలిటీ పాలకవర్గం పదవీకాలం మే 4 వరకు కొనసాగ నుంది. అధికారికంగా ఎన్నికలు అప్పటివరకు ఉండవని స్పష్టత ఉన్నప్పటికీ, పట్టణ రాజకీయ వాతావరణం మాత్రం ఎన్నికల ముసుగులో ముందే వేడెక్కుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో చైర్మన్, చైర్పర్స న్ రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో, సిద్దిపేట మున్సిపాలిటీ చైర్మన్ పదవి బీసీ జనరల్కు కేటాయించబడినట్టు వెలువడిన సమాచా రం రాజకీయ చర్చలకు మరింత ఆజ్యం పో సింది. ఎన్నికలే లేకపోతే రిజర్వేషన్లు ఎం దుకు ఖరారు? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి టీ స్టాల్ నుంచి రాజకీయ వేదికల వరకూ మార్మోగుతోంది.
ఇటీవల వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారైన తర్వాత, సిద్దిపేట మునిసిపాలిటీకి సంబంధించిన పాత రిజర్వేషన్ల జాబితాలే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా యి. అవే రిజర్వేషన్లు ఈసారి కూడా కొనసాగుతాయి అని ప్రచారం ఆశావాహులలో తీవ్ర నిరాశను నింపుతోంది. ఒకవైపు రిజర్వేషన్ల మార్పు లేకపోతే పోటీ అవకాశాలు సన్నగిల్లుతాయని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు చైర్మన్ పదవికి మాత్రం బీసీ జనరల్ రిజర్వేషన్ ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు సరైన సమాధానం కనిపించ డంలేదు. ఇది యాదృచ్ఛికమా? లేక రాజకీయ వ్యూహంలో భాగమా? అన్న అనుమా నాలు పట్టణ రాజకీయాలను ఊగిసలాటకు గురిచేస్తున్నాయి.
సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా గడువు ముగిసిన మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే, ప్రధాన పార్టీలు రాష్ట్రస్థాయి ప్రచారంలో మునిగి తేలుతాయి. అటువంటి వేళ స్థానిక నాయకులు తమ వార్డుల్లో వ్యక్తిగత పట్టును ఉపయోగించుకుని, నిశ్శబ్దంగా కానీ సమర్థవంతంగా గెలుపు దిశగా అడుగులు వేయగలుగుతారు. కానీ సిద్దిపేట మునిసిపాలిటీ ఎన్నికలు మాత్రమే ప్రత్యేకంగా నిర్వహిస్తే మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారుతుంది. కాంగ్రెస్, బీజేపీ స హా రాష్ట్రస్థాయి నాయకత్వం మొత్తం సిద్దిపేటపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు బీఆర్‌ఎస్కు కంచుకోటగా ఉ న్న సిద్దిపేట రాజకీయ ఆధిపత్యాన్ని కుదిపేసే అవకాశాలకూ దారితీస్తుంది.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేటను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తోందన్న అనుమానం పట్టణ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే అధికారికంగా మాత్రం సిద్దిపేట మునిసిపాలిటీ పాలకవర్గం పదవీకాలం ముగిసిన తర్వాతే ఎన్నికలు అని స్పష్టీకరణ పదే పదే వినిపిస్తోంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా గడువు ముగి సిన మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినా, సిద్దిపేట మాత్రం వాటికి అతీతంగానే ఉం టుంది అన్నది స్పష్టం అవుతోంది. అయినప్పటికీ, చైర్మన్ పదవి రిజర్వేషన్ ఖరారు చేయడంలో చూపిన తొందర, వార్డు రిజర్వేషన్లపై స్పష్టత లేకపోవడం, సోషల్ మీడి యాలో పాత జాబితాలు వైరల్ కావడం వం టి అంశాలు కలసి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇది కేవలం సమాచార లోపమా? లేక రాజకీయంగా కావాలనే సృష్టించిన అస్పష్టతా? అన్న అనుమానం ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని దెబ్బతీసే స్థాయికి చేరుతోంది.
చైర్మన్ పదవి ఆసక్తికరం..
బీసీ జనరల్ కేటగిరీకి చైర్మన్ పదవి ఖరారు కావడం బీసీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నాలుగుసార్లు మున్సి పాలిటీ పగ్గాలు బీసీల చేతుల్లోనే ఉన్నాయి. అన్ని పార్టీల్లోని బీసీ నాయకులు తమదే చైర్మన్ పదవి అన్నట్టుగా ప్రచారం మొదలుపెట్టేశారు. అధికారిక ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాకముందే, వార్డుల వారీగా ఆశావాహులు ఇంటింటి ప్రచారానికి దిగడం రాజ కీయ వేడి ఏ స్థాయిలో ఉందో స్పష్టం గా చూపిస్తోంది. ఇది ఒకరకంగా ప్రజాస్వామ్య ఉత్సాహాన్నే ప్రతిబింబించినప్పటికీ, మరోవైపు ఎన్నికలపై స్పష్టత లేకపోవడం వల్ల ఈ ఉత్సాహం చివరకు నిరాశగా మారే ప్రమా దం కూడా లేకపోలేదు.
సిద్దిపేట రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, ఈ పట్టణం ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇక్కడ జరిగే ఎన్నికల ఫలితాలు కేవలం స్థానిక పాలనకే కాకుండా, రాష్ట్ర స్థాయి రాజకీయ సమీకరణాలకూ దిశానిర్దేశం చేసిన సందర్భాలు ఎ న్నో ఉన్నాయి. అందుకే సిద్దిపేట మునిసిపాలిటీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అవి సా ధారణ స్థానిక సంస్థ ఎన్నికలుగా కాకుండా, రాష్ట్ర రాజకీయ శక్తుల మధ్య ప్రతిష్ఠాత్మక పోరాటంగా మారడం ఖాయం.
ఈ నేపథ్యం లో ఎన్నికలను వాయిదా వేయడం గానీ, అస్పష్టతను కొనసాగించడం గానీ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు పౌర సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి కేవలం అధికార మార్పిడి ప్రక్రియ మాత్రమే కాదనీ, అవి ప్రజల విశ్వాసానికి అద్దం కావాలని, కానీ సిద్దిపేట విషయంలో ఆ అద్దంపై ఇప్పు డు అనుమానాల మబ్బు కమ్ముకుంటోంది. ఒకవైపు ప్రభుత్వం గడువు ముగిసిన మున్సిపాలిటీలకే ఎన్నికలు అని చెబుతుంటే, మరోవైపు రిజర్వేషన్ల ఖరారు, సోషల్ మీడియాలో ప్రచారం, రాజకీయ పార్టీల హడా వుడి కలిసి ప్రజల్లో గందరగోళాన్ని పెంచుతున్నాయి. ఇది సహజంగానే ఎన్నికలు ఉంటాయా? ఉండవా? అన్న ప్రశ్నకు బదు లు దొరకని పరిస్థితిని సృష్టిస్తోంది.
అంతేకాదు, సిద్దిపేటకు ప్రత్యేకంగా ఎన్నికలు జరిపితే అన్ని పార్టీల చూపు ఇక్కడే కేంద్రీకృతమవుతుంది అన్న వాదన కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇది ప్రభుత్వానికి వ్యూహాత్మకంగా ఇబ్బందికరమవుతుందని, అందుకే ఎన్నికలను రాష్ట్ర వ్యాప్త షెడ్యూల్ నుంచి తప్పించారని కొందరు విమర్శకులు ఆరోపిస్తున్నారు. మ రోవైపు, ప్రభుత్వం మాత్రం దీనిని ఖండిస్తూ, ఇది పూర్తిగా నిబంధనల ప్రకారం జరిగే ప్రక్రియ అని స్పష్టం చేస్తోంది. కానీ ప్రజలకు మాత్రం ఈ వివరణలు సరిపోవడం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రక్రియ ఎంత పారదర్శకంగా ఉంటే, అంతగా ప్రజల నమ్మకం బలపడుతుంది. కానీ సిద్దిపేట విషయంలో పారదర్శకత కంటే రాజకీయ ముసుగే ఎక్కువగా కనిపిస్తోందన్న భావన బలపడుతోంది.
ఇప్పటివరకు లభిస్తున్న సంకేతాల ప్రకారం, సిద్దిపేట మునిసిపాలిటీ ఎన్నికలు తక్షణం జరిగే అవకాశాలు లేవన్నది అధికారిక వర్గాల స్పష్టీకరణ. అయినప్పటికీ, రాజకీ యంగా మాత్రం ఈ పట్టణం ఇప్పటికే ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. వార్డు స్థాయి లో ఆశావాహులు తమ సామాజిక బలాలను గణనలోకి తీసుకుంటూ, రిజర్వేషన్ల అంకెలను విశ్లేషిస్తూ, పార్టీల మధ్య అంతర్గత సమీకరణాలు మొదలుపెట్టేశారు. ఇది ఎన్నికలు ఎప్పుడైనా జరిగినా, పోరు మాత్రం తీవ్రంగా ఉండబోతోందన్న సంకేతాలను స్పష్టంగా ఇస్తోంది.
మొత్తానికి, సిద్దిపేట మునిసిపల్ ఎన్నికలు కేవలం స్థానిక రాజకీయ అంశంగా కాకుండా, రాష్ట్ర రాజకీయ వ్యూహాల్లో కీలక అంశంగా మారాయి. ఎన్నికలపై అస్పష్టత, రిజర్వేషన్లపై సందేహాలు, సోషల్ మీడియా ప్రచారం, పార్టీల మధ్య ముందస్తు పోటీ ఇవన్నీ కలసి సిద్దిపేట రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి.
ఎన్నికలపై స్పష్టత, ప్రక్రియపై పారదర్శకత, ప్రజాస్వామ్యంపై నమ్మకం. ఇవి లేకపోతే, సిద్దిపేట మునిసిపాలిటీ ఎన్నికలు జరిగాయా లేదా అన్నదానికంటే, ప్రజాస్వామ్యానికి జరిగిన నష్టం ఎక్కువగా మిగిలే ప్ర మాదం ఉంది.సిద్దిపేటలో ఎన్నికలు ఇప్పు డే జరగకపోయినా, రాజకీయ వేడి మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. బీసీ నినాదం బలంగా వినిపిస్తున్న ఈ సమయంలో, చైర్మ న్ పదవి బీసీ జనరల్ కేటగిరీకి దక్కడం సామాజిక, రాజకీయ సమీకరణాలను మ రింత సంక్లిష్టంగా మార్చుతోంది. అన్ని పార్టీల్లోని బీసీ నాయకులు ఈసారి మాది అన్న ధీమాతో రంగంలోకి దిగుతుండటం, ఎన్నికలు ఎప్పుడైనా జరిగినా అవి సాధారణ పో టీగా కాకుండా, సామాజిక సమీకరణాల ఆధారంగా తీవ్ర పోరాటంగా మారబోతున్నాయన్న సంకేతాలను ఇస్తోంది.