calender_icon.png 21 August, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట రైల్వే ట్రయిల్న్ సక్సెస్

21-08-2025 12:09:29 AM

వచ్చే కొద్ది రోజుల్లో చిన్న కోడూరు మీదుగా రైలు

సిద్దిపేట, ఆగస్టు 20 (విజయక్రాంతి): గత ప్రభుత్వం లోనే సిద్దిపేట కు రైలు కళ నెరవేరిందని, బి ఆర్ ఎస్ ప్రభుత్వం లోనే సిద్దిపేట కొత్త పల్లి రైల్వే లైన్ కు రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్ని నిధులు ఇచ్చామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట రైలును ప్రారంభించి సిద్దిపేట ప్రజల రైలు కళ నెరవేర్చమని చెప్పారు.

సిద్దిపేట నుండి సిరిసిల్ల కు వెళ్లే రైల్వే లైన్ పనులు చకచక జరుగుతున్నాయని, అందులో భాగంగా బుధవారం చిన్నకోడూరు రైల్వే లైన్ లో 10కిలోమీటర్లు ట్రాయిల్ రన్ విజవంతం కావడం సంతోషమని, రాబోయే కొద్దీ రోజుల్లో చిన్నకోడూరు లో రైలు కూత కుయనుందని హరీష్ రావు అన్నారు. చిన్న కోడూరు లో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రికి ప్రతిపదనలు కూడా పంపామని చెప్పారు. కొద్దీ రోజుల్లో రైల్వే స్టేషన్ కూడా రాబోతుందన్నారు.