29-01-2026 12:31:40 AM
ఉట్నూర్, జనవరి 28 (విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రంలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఇంట్లో చొరబడి వెండి ఆభరణాలు, నగదును దొంగలించారు. ఉట్నూర్ ఎస్సై విజయ్ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన సిలువేరు సత్యం కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ములుగు జిల్లా మేడారం జాతరకు వెళ్లారు. మేడారంలో సమ్మక్క సారక్క కు మొక్కులు తీర్చుకొని మంగళవారం రాత్రికి ఉట్నూరు చేరుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి తలుపులు తీసి ఉండడంతో దొంగలు పడ్డట్లు గమనించారు. ఇంట్లో భద్రపరచుకున్న 13 తులాల వెండి పట్ట గొలుసులు, రూ. 25 వేల నగదు దొంగతనం అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిలువేరు సత్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.