calender_icon.png 21 May, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో సిందూర్ వీధి

21-05-2025 01:19:26 AM

-  నామకరణం చేసిన కాలనీవాసులు 

కామారెడ్డి, మే 20 (విజయక్రాంతి): ఇటీవల పాకిస్థాన్‌పై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో యుద్ధం చేసిన విషయం తెలిసిందే. సైన్యం చేసిన సిందూర్ ఆపరేషన్ విజయవంతం కావడంతో ఆ పేరును ఆదర్శంగా ఉంచేందుకు  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ ప్రాంతంలోని ఓ వీధికి స్థానికులు సిందూర్ వీధిగా మంగళవారం నామకరణం చేసి బోర్డును ఏర్పాటు చేశారు. భారత సైనికుల త్యాగం మరువకుండా ఉండాలనే ఉద్దేశంతో కాలనీలోని వీధికి సిందూర్ వీధిగా పేరు పెట్టినట్లు కాలనీవాసులు తెలిపారు.