calender_icon.png 21 May, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాడ్వాయిలో ఘనంగా బోనాల పండుగ

21-05-2025 01:20:00 AM

తాడ్వాయి, మే 20 ( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో మంగళవారం మెట్టు మాదిగ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు ఇంటికి ఒక బోనం చొప్పున తీసుకొని గ్రామంలో ఊరేగింపుగా వెళ్లారు అనంతరం గ్రామదేవతల వద్ద బోనాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని దేవతలను ప్రార్థించారు ఈ కార్యక్రమంలో మెట్టు మాదిగ సంఘం ప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు