26-08-2025 01:41:01 AM
-అదునుచూసి చెలరేగుతున్న భూబకాసురులు
-యాజమాన్యం పెట్టిన బోర్డులు తీసేసి కబ్జాలు
-అయోమయంలో మున్సిపల్ అధికారులు
రామకృష్ణాపూర్,ఆగస్టు 25 : కోల్ బెల్ట్ ఏరియాలో కబ్జాదారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఖాళీగా సింగరేణి స్థలం కనిపి స్తే చాలు పలువురు పార్టీ పెద్దల అండతో కబ్జాలకు పాల్పడుతున్నారు. సింగరేణి ఖాళీ స్థలాలు కబ్జా కోరాలకు చిక్కకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని తొలగించడం లేదా వాటిని పక్కకు నెట్టివేసి ఆక్ర మణలను పాల్పడుతున్నారు.
ఇదే క్రమంలో పట్టణ నడిబొడ్డున సూపర్ బజార్ చౌరస్తాను అనుకోని ఉన్న సింగరేణి ఖాళీ స్థలం ఆక్రమణదారుల కోరల్లో ఉన్నట్లు తెలుస్తోం ది. ఓ సంఘానికి చెందిన పలువురు గతం లో ఈ స్థలంలో రాత్రికి రాత్రే ప్రహారీ నిర్మాణాలు చేయడంతో వార్త పేపర్లలో రాగా సిం గరేణి అధికారులు స్థానిక పోలీసులను ఆశ్రయించి సింగరేణి స్థలం కబ్జాకు గురైనట్లు ఫిర్యాదు చేశారు. సింగరేణి ఎస్టేట్?, ఎస్? అండ్? పీసీ సిబ్బంది అట్టి నిర్మాణాలను అడ్డుకొని కంచెను ఏర్పాటు చేశారు.
ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని, సంస్థ ఎవ్వరికీ స్థలం అప్పగించలేదని అప్పుడే సింగరేణి అధికారులు తేల్చిచెప్పారు. ఇదంతా జరిగి ఏడాది కాగా ఈ స్థలం ఊరు మద్యలో ఉండటంతో పాటు సుమారు 2 ఎకరాల వరకు ఉండటంతో మరో సారి ఈ ఖరీదైన సింగరేణి స్థలం దక్కించుకోవడానికి పలువురు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
సింగరేణి ఎస్టేట్?, ఎస్? అండ్? పీసీ సిబ్బంది కంచెను ఏర్పాటు చేసినప్పటికి సింగరేణి యాజమాన్యం ఆదేశాలను దిక్కరిస్తూ మరల రాత్రికి రాత్రే పాత షెడ్ వెనక మరో షెడ్ ఏర్పాట్లు కొరకు భారీగా ఉండే ఇనుప పైపులతో నిర్మాణాలు ముమ్మరం చేయడం, అలాగే స్థలాన్ని చదును చేయడంతో పట్టణ ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. గతంలో ప్రహరీ నిర్మాణం గోడలపై దేవుడిపేర్లు రా యడం, జాతీయ జెండాను ఏర్పాటు చేయ డం లాంటి ఎన్నో వినూత్న ప్రయత్నలు చేయడం గమనారం. దీనితో స్థానికుల నుంచి భారీ వ్యతిరేకత రావడం విశేషం.
సింగరేణి స్థలంలో మున్సిపాలిటీ కట్టడాలు
సింగరేణి ఎస్ అండ్? పీసీ సిబ్బంది కంచెను ఏర్పాటు చేయగా దానికి అనుకోని ఉన్న డ్రైనేజీపై మున్సిపాలిటీకి చెందిన ఓ సబ్ కాంట్రాక్టర్ ఏకంగా కాంక్రీట్ తో ర్యాప్ మార్గాన్ని ఏర్పాటు చేశారు. సింగరేణి స్థలం అని తెలిసినప్పటికీ సదరు కాంట్రాక్టర్ ర్యాంప్ ఏర్పాటు చేయడంపై ఎస్టేట్ అధికారులు మండిపడుతున్నారు. ఇలాంటి నిర్మాణాలపై సింగరేణి, మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.