27-01-2026 12:15:37 AM
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మరిపెడ, జనవరి 26 (విజయక్రాంతి): రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని, రైతులకు సాగు ప్రోత్సాహం కింద రైతు బోనస్ అందజేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మ హబూబాబాద్ జిల్లా మరిపెడలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వ హించిన అన్నదాతలకు రాయితీపై యాంత్రికరణ పనిముట్లను ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నా యక్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీ కింద రైతులకు పనిముట్లు అందజేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతు సంక్షేమాన్ని కోరుతూ రైతు పండించిన వరి ధాన్యానికి కింటాకు 500 రూపాయలు బో నస్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రా ష్ట్రంలో వరి సాగు, దిగుబడి పెరిగి దేశంలోనే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పా ర్టీ జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, నూకల అభినవరెడ్డి, మం డల అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు తాజుద్దీన్, ఆత్మ కమిటీ చైర్మన్ సుధాక ర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మ న్ సు ధాకర్ నాయక్, కేసముద్రం మార్కెట్ వైస్ చైర్మన్ అయిలమల్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు రవి నాయక్, ఏ డి ఏ విజ య్ చంద్ర, మరిపెడ అగ్రికల్చర్ ఆఫీసర్ వీరాసింగ్, త హసిల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో వేణుగోపా ల్ రెడ్డి, కమిషనర్ విజయా నంద్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామ్ లాల్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.