17-09-2025 01:38:50 AM
పూర్తి విచారణ చేస్తే అక్రమాలు వెలుగులోకి
పరిశీలన చేస్తాం: కిషన్, తాసిల్దార్, భూత్పూర్ మండలం
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 16(విజయక్రాంతి): భూదాన్ భూములు ఎకరాల కొద్ది ఉన్నప్పటికీ అవి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితులు మహబూబ్ నగర్ జిల్లాలో చో టుచేసుకుంటున్నాయి. ఈ మండలం ఆ మండలం కాదు అన్ని మండలాల్లో భూధన్ భూముల లెక్కలు పూర్తిస్థాయిలో తేల్చండి సారూ అంటూ మండలవాసులు కోరుతుం డ్రు. భూత్పూర్ మండలంలో భూదాన్ భూ ములు దాదాపు వందల ఎకరాల భూము లు 1970 లో భూదాన్ బోర్డు కు విచ్చేసిన అనంతరం మండల కేంద్రంలో సర్వేనెంబర్,173,174,175,176,177, లలో ఎస్సీలు 10 పదిమంది కి, ఎస్టీలు పదిమందికి, బీసీ లు పదిమందికి, ఇతర కులాలకు ఐదు మం దికి భూమిలేని నిరుపేదలకు జిల్లా భూధాన్ బోర్డు అందజేసింది.
భూముల ధరలకు రెక్క లు రావడంతో రియల్ వ్యాపారుల కన్ను భూదాన్ భూముల పై పడింది. భూదానపములను పట్టా భూములుగా మార్చి దర్జాగా క్రయవిక్రాలు జరిగినట్లు తెలుస్తుంది. 2017 నుంచి 2024 వరకు కూడా పూర్తిస్థాయిలో విచారణ చేస్తే భూదాన్ లెక్కలు తేలనున్నా యి.
బతకాలి తరత్రాలు అనే విధంగా చ ట్టాల రూపొందించి భూములను దానం చే స్తే చట్టంలోని కొందరు రుసువులను దేవులాడి వాటిని రియల్ వ్యాపారం కింద మా ర్చి ఇష్టానుసారంగా క్రయవిక్రయాలు చేస్తూ దర్జాగా పోగు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో నాటి నుంచి నేటి వరకు భూమి వివరాలను పరిశీ లించి అవసరమైన చర్యలు తీసుకుంటే ముందు ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఉండే అవకాశాలు మెండుగా ఉండే అవకాశం ఉంది.
అధికారులు అనుకుంటే ఆమోదం లభిస్తుందా..?
భూధాన్ భూములను కాపాడాల్సిన అధికారుల.. ఇలా చేస్తే మీకు సొంతమవుతుందంటూ అనుమతులకు సహకరించా రని ఆరోపణలు బలంగా ఉన్నాయి. 2017 సంవత్సరం తర్వాత ధరణి కోటలో అండ్ రిజిస్ట్రేషన్ శాఖల వెబ్ సైట్ లోని నిషేధిత జాబితాలో భూదాన్ ప్రభుత్వ భూములుగా ఉన్నప్పటికీ, జిపి లేఅవుట్ పేరుతో అనుమతులు పొంది ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పరుగులు పెడుతున్న దాఖలాలు లేకపోలేదు.
కొందరు అధికారులు చట్టంలో ని రుసులను వినియోగిస్తూ అడ్డదారుల్లో అ క్రమంగా ఇతరులకు భూదాన్ భూములను అప్పజెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఈ భూ ములకు సంబంధించి జిల్లా ఉన్నత అధికారులకు సైతం పట్టా భూముల నివేదికలు పంపినట్లు తెలుస్తుంది. దాదాపు గా 35 ఎకరాల ప్రభుత్వ భూదాన్ భూమిగా ఉన్న క్లాసిఫికేషన్ ని ఎలా మార్చారు.?
అబ్ స్ట్రాక్ తీస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావు అప్పుడు ఒత్తిడి చేసిన ఫైళ్లకు రిజెక్ట్ రిపోర్టులు పంపాల్సిన బాధ్యత మండల అధికా రులకు ఉంటుంది. ఈ భూములకు సంబంధించి భూధాన్ బోర్డు అందించిన పట్టా పాస్ పుస్తకాలు, భూదాన్ బోర్డు సమాచార హక్కు చట్ట కింద ఇచ్చిన రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల వాసులు కోరుతుండ్రు.
పూర్తిస్థాయిలో పరిశీలన చేస్తాం..
మండల పరిధిలోని భూదాన్ భూ ములకు సంబంధించి పూర్తిస్థాయిలో పరిశీలన చేయడం జరుగుతుంది. ఇప్పటికే పలు భూముల భూదాన్ భూము లకు సంబంధించి ఫిర్యాదులు అందా యి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం. కిషన్, తహసీల్దార్, భూత్పూర్ మండలం