17-09-2025 01:36:53 AM
విద్యార్థుల తల్లిదండ్రులతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): తమకు సంబంధించిన అంత వరకు రాజకీయ ముఖ్యం కాదని విద్యార్థుల భావితరాల భవిష్యత్తు అతి ముఖ్యమైన అంశమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ ఫస్ట్ - వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న శతశాతం కార్యక్రమానికి ఎంపికైన ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్య క్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మన మహబూబ్ నగర్ బిడ్డ లు మన ప్రాంతంలోనే చదువుకోవాలనే ఎ న్నో విద్యాసంస్థలు తీసుకు వస్తున్నామని, పిల్లలకోసం అగ్రికల్చర్, ఫార్మసీ, ఎంబిఎ కళాశాలలు తెస్తామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుం దని,పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కొన్ని త్యాగాలకు సిద్దం కావాలన్నారు. పిల్లలను చెడు అలవాట్లకు దూరం చెయ్యాలని స్పష్టం చేశారు.
అందుకు ఉదాహరణ బ్యా ట్మెంటన్ క్రీడాకారిణి పివి సింధు అని, ఆమె బ్యాట్మెంటన్ లో ప్రపంచ స్థాయిలో రాణించిందంటే వారి తల్లిదండ్రులు చేసిన త్యాగం, కృషి తెరవెనుక ఎంతో ఉందన్నారు. గత సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ల్లో చదివిన విద్యార్థులు 114 మందికి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మరియు ఫార్మసీ లలో సీట్లు ఉచితంగా పొందారని ఆయన గుర్తు చేశారు.
తాను రాజకీయాలకోసం ఈ కార్యక్రమం చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోవందేమాతరం ఫౌండేషన్ ఫౌండర్ రవీందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిఎంఓ బాలు యా దవ్, ఎఎంఓ దుంకుడు శ్రీనివాస్, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, రామకృష్ణ మఠం నిర్వహకులు రాజమల్లేష్, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.