26-08-2025 01:56:45 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం, ఆగస్టు 25 : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమల తండాలో సోమవారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయం, భవానీ మాత దేవాలయం వార్షికోత్సవం, బోనాల పండుగల కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. దేవాలయము అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, మాజీ కౌన్సిలర్లు లచ్చి రామ్, రవీందర్ రెడ్డి, బాబ్జి, కొమరయ్య, చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు