calender_icon.png 15 August, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు

15-08-2025 01:52:57 AM

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 14, (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట గురువారం నిషేధిత సిపిఐ ఎంఎల్ మావోయిస్టు 6 గురు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను ఎస్పీ రోహిత్ రాజ్ విలేకరులకు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై ఆయుధాలను వీడి, జనజీవన శ్రవంతి లో కలుస్తున్నా రన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు, 81, 141 సిఆర్పిఎఫ్ బెటాలియన్ పోలీసుల ఎదుట వివిధ స్థాయిల్లో పనిచేసిన ఆరుగురు మావోయిస్టు సభ్యులు లొంగి పోయినట్టు తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు మహిళా దళసభ్యు లున్నారు. మడకం లక్మే , సోడి భీమే, సోడి రాజే, మడవి సోనా, మడవి భీమ, మడకం భీమయ్య లొంగపోయిన వారిలో ఉన్నారు. లొంగిపోయిన ప్రతి ఒక్కరికి తక్షణసాయంగా రో 25వేల చొప్పున రూ 1.50 లక్షల ను ఇవ్వడం జరిగిందన్నారు.

మిగతా నగదును ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ వచ్చిన తర్వాత వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. నమ్మకంతో , భయంతోనో మావోయిస్టు పార్టీకి ఎంత సహకరించినా మీ ఆదివాసి ప్రాంతాల అభివృద్ధి నోచుకోవని కేవలం ప్రజాస్వామ్య ప్రభుత్వాల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని, శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని ఆదివాసి ప్రజలు తెలుసుకోవాలని కోరారు.