calender_icon.png 15 August, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి ఊరట

15-08-2025 01:52:30 AM

  1. కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్‌నాయక్ పిటిషన్ కొట్టివేత

సంబురాల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): 2023 ఎన్నికల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి గెలుపును సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యామ్ నాయక్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు గతంలో లక్ష్మికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో శ్యామ్‌నాయక్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.  లక్ష్మి 2023 ఎన్నికల్లో తను ఎన్నికల కమిషన్ కు అందజేసిన ఆఫ్‌డవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె ఎన్నిక చెల్లదని   హైకోర్టులో శ్యామ్ నాయక్  పిటిషన్ దాఖలు చేశారు.

అయితేహైకోర్టు ఆమెకు అనుకూలంగా గతంలో తీర్పు ఇవ్వడంతో శ్యామ్ నాయక్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు.  విచారణ చేపట్టిన  సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం హైకోర్టు  తీర్పును సమర్థిస్తూ  ఆ పిటిషన్ ను కొట్టివేసింది.అత్యున్నత న్యాయస్థానంలో లక్ష్మికి అనుకూలంగా తీర్పు రావడంతో నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు సంబురాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.అత్యున్నత న్యాయస్థానం న్యాయం వైపే మొగ్గు చూపిందని ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఈ సందర్భంగా తెలిపారు.