23-05-2025 12:00:00 AM
నిర్మల్/ఖానాపూర్ మే 22 (విజయ క్రాం తి): ఆరుగాలం కష్టపడి పండించి కొమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నా వరి జొన్నలు అకా ల వర్షంతో తడిసి ముద్ద కావడంతో జిల్లా రైతాంగం ఆందోళన చెందుతుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రా ల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న వారి జొన్న లు బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల తడిసిపోవడంతో దాన్యం రంగు మారి బెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలో ఖానాపూర్ కడెం సోన్ లక్ష్మచెందా నరసాపూర్ జి కుంటాల నిర్మల్ రూలర్ దస్తురా బాద్ తదితర మండలలో వేలకుంటల్లో దాన్యం తడిసినట్టు రైతులు ఆరోపిస్తున్నారు.
ఖానాపూర్‌లో ఎమ్మెల్యే నిలదీత
జిల్లాలో కురిసిన అకాల వర్షంతో ధా న్యం మొత్తం తడిసిపోయిందని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ జిల్లాలో గురువారం రైతులు ఆందోళన చేపట్టారు. ఖానాపూర్ వరి ధాన్యం కొనుగోలు పరిశీలించిన ఎమ్మెల్యే వేడ్మ బుజ్జు పటేల్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలలో ఆలస్యం చేయడం వలన తమ పంట తడిసిపోయిందని తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఎమ్మెల్యేలు నిలదీయగా ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా కానాపూర్ పట్టణంలో తేమ నిబంధన ఎత్తివేసి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు నిర్మల్ ఖానాపూర్ జాతీ య రహదారిపై ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మూడు గంటలు రాస్తారోకో నిర్వహించారు. రైతులు స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని కలెక్టర్ రావాలని డిమాండ్ చేయడంతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కోమల్ రెడ్డి జిల్లా అధికారులు అక్కడికి వెళ్లి రైతులతో మాట్లా డి తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
నర్సాపూర్ జి మండల కేంద్రం వద్ద సుమారు 200 మంది రైతులు తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై రెండు గంటలు రాస్తారోకో చేశారు. సంఘటన చేరిన సిఐ రామకృష్ణ తాసిల్దార్ శ్రీకాంత్ అక్కడికి చేరి తడిసిన ధాన్యం కొనుగోలు చేసేలా కలెక్టర్ హామీ ఇచ్చినట్టు చెప్పడంతో ఆందోళన నిర్మించారు.
ఇదిలా ఉండగా కుం టాలలో తడిసిన జొన్నలను వెంటనే తూకం వేయాలని రైతులు పీఎస్‌ఎస్ కార్యాలయం లో ఆందోళన చేశారు. ఫోన్ లక్మచందా కడెం గ్రామాల్లో ధాన్యం రైతులు తడిసిన పంటను కొనుగోలు చేయాలని అక్కడ అధికారులను కోరారు. జిల్లా వ్యాప్తంగా బీఆర్ ఎస్, సిపిఎం పార్టీ నాయకులు వర్షం వల్ల తడిసిపోయిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కొనుగోలు కేంద్రాలను సందర్శించి అధికారులకు వినతి పత్రాలు అందించారు.
ఆందోళన వద్దు: కలెక్టర్ అభిలాష
నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల వర్షం వల్ల పంట కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి ధాన్యం జొన్నలను ప్రభుత్వం కొనుగో లు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్ద ని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో కొనుగో లు కేంద్రంలో ఉన్న ధాన్యం వర్షం కారణం గా తడిసిపోవడంతో సంబంధిత అధికారు లు నివేదికను అందజేసిన వెంటనే ప్రభు త్వం దృష్టికి తీసుకువచ్చి ప్రభుత్వ ఆదేశాల మేరకు తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామ ని రైతులు ఆందోళన చెందవలసిన అవస రం లేదని వివరించారు. ఎక్కడైనా ఇలాంటి ఇబ్బంది ఉన్న అధికారులను సంప్రదించాలని రైతులు ప్రస్తారోకోలు ఆందోళనలు చేయవద్దని సూచించారు.