calender_icon.png 24 December, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

..అయినా అవకాశాల భాగ్యం!

24-12-2025 12:00:00 AM

ప్రస్తుతం విడుదల తర్వాత ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు పొందుతున్న హీరోయిన్ ఎవరంటే.. భాగ్యశ్రీ బోర్సే పేరే ఠక్కున చెప్తున్నా రంతా! మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, కాంత సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాపులు సొంతం చేసుకొందీ మరాఠా ముద్దుగుమ్మ. ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమాకు మంచి టాక్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితేనేం, ఏదో ఓ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ పేరు వినిపిస్తూనే ఉంది. స్వప్నదత్ ఇప్పుడు ఓ కొత్త సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. ఆ చిత్రంలో హీరోయిన్‌గా భాగ్యశ్రీని ఎంచుకున్నారు.

ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ. కథలో కథానాయికదే కీలక పాత్ర. అందుకు అభినయం ఉన్న హీరోయిన్ కావాలని పలు పేర్లను పరిశీలించిన చిత్రబృందం చివరికి భాగ్యశ్రీని ఎంపిక చేసుకున్నారు. దీనికి ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’ అనే టైటిల్‌ను ఖాయం చేశారని సమాచా రం. మద్యపాన నిషేధం చుట్టూ తిరిగే కథ ఇది. తండ్రీకూతుళ్ల అనుబంధం ఈ కథకు బలం. తండ్రిగా ఓ పేరున్న నటుడు కనిపించే అవకాశం ఉంది.    భాగ్యశ్రీ ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా అవకాశాలు రావడానికి కారణం ఆమె ప్రతిభే!