calender_icon.png 16 September, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గృహ యాజమానులకు స్మార్ట్ కార్డు!

22-06-2025 12:00:00 AM

ఇంటి నిర్మాణం  కోసం ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల అనుమతి కోసం దరఖాస్తు చేసుకొనే వారెందరో. నిర్మాణం పూర్తయిన తర్వాత ఆస్తి పన్ను  చెల్లిస్తుంటారు. అయితే, సొంత ఇల్లు కలిగిన వారందరికీ ప్రభుత్వం ఒక ఓనర్ షిప్ స్మార్ట్ కార్డును ఇవ్వగలిగితే బావుంటుంది. యాజమాని పేరు మీద ప్రతి ఇండెపెండెంట్ ఇంటికి లేదా అపార్ట్‌మెంట్‌లోని  ఫ్లాట్స్‌కు యజమానుల పేరు మీద వీటిని మంజూరు చేయాలి.

దీనిని బహుళ ప్రయోజనాలకు ఉపయోగించే విధంగా అమలులోకి తేవాలి. ప్రతిసారి లావాదేవీలు జరిగినప్పుడల్లా సంబంధిత పత్రాలు అన్నీ సమర్పించనవసరం లేకుండా స్థానిక సంస్థలను రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేయాలి. యాజమాన్యపు హక్కులు బదిలీ చేసినప్పుడు లేదా క్రయవిక్రయాలు జరిగినప్పుడు  ఎలాంటి అవరోధాలు లేకుండా ఈ కార్డుద్వారా లావాదేవీలు జరుపుకోవడానికి వీలుంటుంది. 

మన నిత్య జీవితంలోని ఓటర్ ఐడీ ఆధార్, పాన్, ఏటీఎం, క్రెడిట్ కార్డులు, వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, మెట్రో రైల్ ఉద్యోగ ఐడీ మొదలైన కార్డుల వలె హౌజ్ ఓనర్‌షిప్ స్మార్ట్‌కార్డులు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. ఇందుకోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలి.

 దండంరాజు రాంచందర్‌రావు, హైదరాబాద్