calender_icon.png 14 November, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సు టైరుల్లో నుంచి పొగలు

14-11-2025 12:56:15 AM

తప్పిన పెను ప్రమాదం... ప్రయాణికుల సురక్షితం

ఆదిలాబాద్, నవంబర్ 13 (విజయక్రాం తి) : ఆర్టీసీ బస్సు టైరుల్లో నుండి ఒక్కసారిగా పెద్దఎత్తున పొగలు వెలువరడంతో డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పి, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుం ది.  ప్రయాణికులు తెలిపిన వివరాల... గురువారం ఉదయం ఆదిలాబాద్ నుండి నిర్మల్ కు వెళ్లిన ఆదిలాబాద్ డిపో ఆర్టీసీ(అద్దె బస్సు) తిరిగి ఆదిలాబాద్ వస్తున్న క్రమంలో దేవాపూ ర్ చెక్ పోస్ట్ సమీపంలో జాతీయ రహదారిపై బస్ వెనుక టైరులో నుండి ఒక్కసారిగా  పొగలు వెలువడ్డాయి.

దట్టమైన పొగలను గమనించిన ప్రయాణికులు భయాందోళన. దీంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి మంటలు చెలరేగాక ముందే బస్సును అక్కడనే నిలిపివేశాడు. అనంతరం బస్సులోని ప్రయాణికులందరినీ కిందికి దింపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పగా, ప్రయాణికులందరినీ సురక్షితంగా ఇతర బస్సులో ఆదిలాబాద్‌కు తరలించారు. కాగా బస్సుకు సంబంధించిన బ్రేక్ లైనర్ల సెట్టింగ్ లో కొంత ఎక్కువ సెట్టింగ్ కావడంతో టైర్‌లోని బ్రేక్ లైనర్ల మధ్య రాపిడి పెరిగి పొగ వెలువడిందని ఆర్టీసీ సిబ్బంది  పేర్కొన్నారు.