calender_icon.png 27 January, 2026 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యోద్భవతో సామాజిక మార్పు

27-01-2026 12:47:34 AM

సంస్థ ఏర్పాటుతో ఉపాధి, గ్రామీణ విద్యలో ఒక కొత్త అధ్యాయం

హైదరాబాద్, జనవరి 26: నగరంలోని స్పేసియన్ టవర్స్‌లో సోమవారం ‘విద్యోద్భవ’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభిం చారు. విద్య ద్వారా సామాజిక మార్పును తీసుకువచ్చే ఒక ప్రపంచ స్థాయి ఉద్యమానికి ఈ కార్యక్రమం నాంది పలికింది. ‘ఏ వర ల్డ్ ఎంప్లాయిడ్’ (ప్రపంచమంతా ఉపాధి) అనే దార్శనికతతో, ‘ఒన్ లెర్నర్.. టూ లైవ్స్ ట్రాన్స్‌ఫార్మ్‌డ్’ (ఒక అభ్యాసకుడు.. రెండు జీవితాల మార్పు) అనే లక్ష్యంతో విద్యోద్భవ సంస్థ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల ప్రతిభకు, ప్రపంచ స్థాయి అవకాశాలకు మధ్య వారధిగా ఉంటూ, సమాజానికి ఒక గొప్ప విద్యా భాగస్వామిగా నిలవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ వ్యాట్ ట్రిబ్యునల్ డిపార్ట్‌మెంటల్ మెంబర్ (జడ్జి) జి. లావణ్య హాజరై విద్యోద్భవ చేపట్టిన ఈ నిర్మాణాత్మక సాధికారతను అభినందించారు. గౌరవ అతి థి ఇనోవర్ టెక్ హెచ్‌ఆర్ సీనియర్ డైరెక్టర్ నిషా నాయర్ భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోగల పని సంస్కృతిని నిర్మించడంలో విద్యో ద్భవ పాత్రను కొనియాడారు. హైదరాబాద్, బెంగళూరు, పూణె, చెన్నై, వైజాగ్‌తో పాటు అమెరికాలో కూడా తన కార్యకలాపాలను విస్తరించిన విద్యోద్భవ, తన ‘ట్రైన్ ద ట్రైనర్’ కార్యక్రమం ద్వారా నాణ్యమైన శిక్షణను అందిస్తోంది.

అచెరాన్ సాఫ్ట్‌వేర్ పీపుల్ అండ్ కల్చర్ హెడ్ ఫెబినా నష్రిన్ ఈ సంస్థకు సీఎస్‌ఆర్ మద్దతునిస్తూ, వ్యాపార వృద్ధి అనేది సామాజిక బాధ్యతతో ముడిపడి ఉండాలని పిలుపునిచ్చారు. హైకోర్టు న్యాయవాది, ఏకే ఫౌండేషన్ చైర్మన్ అనిల్‌కుమార్ కట్టెబోయిన నేతృత్వంలో ‘విద్యాబంధు’ ద్వారా గ్రామీణ పాఠశాలల్లో లైబ్రరీలు, మౌలిక సదుపాయాల కల్పనను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఏఐ,మార్కెటింగ్, హెచ్‌ఆర్ వంటి రంగాల నిపుణులు మెంటార్లుగా వ్యవహరిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నారు.