07-05-2025 12:16:18 AM
-లలిత హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ విజయ
గుంటూరు, మే 6 (విజయక్రాంతి): రాజకీయ నాయకుల నుంచి సామాన్య ప్రజల వరకు సామాజిక న్యాయం జరగాలంటే జర్నలిజం ఎంతో అవసరమని లలిత సూ పర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ విజయ తెలిపారు. మంగళవారం గుంటూరులోని ఎల్వీఆర్ క్లబ్‌లో జరిగిన ఏపీడ బ్ల్యూజే యూనియన్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
కొవిడ్ మహమ్మారి ప్రబలినప్పుడు ప్రజలకు అవసరమైన సమాచారాన్ని చేరవేస్తూ, అనుక్షణం వారిని అప్రమత్తం చేయడంలో ప్రసారమాధ్యమాలు పోషించిన నిర్మాణాత్మక పాత్ర మరువలేనిదని కొనియాడారు. గుంటూరు జిల్లాలోని ప్రతి విలేకరికి హాస్పిటల్ తరఫున రాయితీతో కూడిన వైద్యం చేయించుకునేందుకుకార్డులు మంజూరు చేస్తానని తెలిపారు.
పక్షవాతం వచ్చిన వారికి అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న లలితా సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రికి ప్రపంచ స్ట్రోక్స్ అసోసియేషన్ నుంచి డైమండ్ పురస్కారం దక్కిందని, ఆ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందమైన విషయమని ఆమె తెలిపారు. తదుపరి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు మీరా వలి, జిల్లా రిపోర్టర్లు డాక్టర్ విజయను శాలువాలతో ఘనంగా సత్కరించారు.