calender_icon.png 7 May, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త పోప్‌కు నేడు ఎన్నిక

07-05-2025 12:13:00 AM

-వాటికన్ సిటీలోని సిస్టిన్ చాపెల్‌లో రహస్య ఓటింగ్

-పాల్గొననున్న 135 మంది కార్డినల్స్

-మూడు రోజుల తర్వాతే తుది ఫలితం

-రేసులో ఫిలిప్పీన్స్ కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే

వాటికన్ సిటీ, మే 6: నూతన పోప్ ఎన్నిక ప్రక్రియకు అంతా సిద్ధమైంది. బుధవారం వాటికన్ సిటీలోని సిస్టిన్ చాపెల్‌లో జరిగే కార్యక్రమంలో రహస్య ఓటింగ్ విధానంలో ఎన్నిక జరగనుంది. ప్రపంచ దేశాల నుంచి సుమారు 135 మంది కార్డినల్స్ ఈ ప్రక్రియలో భాగస్వాములు కానున్నారు. ఇందులో భారత్ నుంచి నలుగురు కార్డినల్స్ ఉన్న సంగతి తెలిసిందే.

పోప్ ఎన్నిక ప్రక్రియ ఎన్ని రోజులు జరుగుతుందనే దాని పై స్పష్టత రాలేదు. అయితే గతంలో 2005, 2013లో రెండు రోజుల వ్యవధిలోనే తదుపరి పోప్ ఎవరన్న విషయం తేలిపోయింది. దీంతో ఈసారి కొత్త పోప్ ఎన్నికకు మూడు రోజులు పట్టే అవకాశముందని వాటికన్ సిటీ తెలిపింది. ఎన్నిక ప్రక్రియకు ముందు కార్డినల్స్ అంతా కలిసి సెయింట్ పీటర్స్ బసిలికాలో జరగనున్న సాముహిక ప్రార్థనల్లో పాల్గొంటారని, అనంతరం ఓటింగ్‌కు అర్హులైన వారంతా సిస్టిన్ చాపెల్‌లో రహస్య విధానంలో జరిగే ఎన్నిక ప్రక్రియలో పాల్గొంటారని వాటికన్ సిటీ ప్రతినిధి మాటియో బ్రునీ వెల్లడించారు. 

సుదీర్ఘమైన ప్రక్రియ..

సిస్టిన్ చాపెల్‌లోకి వెళ్లిన కార్డినల్స్ అం తా కొత్త పోప్ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేవరకు బయట ప్రపంచానికి దూరంగా ఉంటా రు.  ఈ సుదీర్ఘ ప్రక్రియలో మొదటి రోజు మధ్యాహ్నం జరిగే ఓటింగ్‌లో కార్డినల్స్ ఒకే ఒక్కసారి ఓటేసార్తు. ఫలితం తేలకుంటే తర్వాతి రోజుల్లో నాలుగుసార్లు చొప్పున ఓటేయాల్సి ఉంటుంది. మూడింట రెండొంతుల మెజారిటీ ఓట్లు సాధించిన వారే నూత న పోప్‌గాఎంపికవ్వనున్నారు.

అయితే ఇం దుకు కొంత సమయం పట్టనుంది. మూడోరోజు ఫలితం తేలకుంటే ప్రార్థనలో కోసం విరామమిచ్చి మరోసారి ఓటింగ్ ప్రక్రియ చేపడతారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం పర్యాటకులను బయటకు పంపిం చేసిన వాటికన్ సిటీ అధికారులు సిస్టిన్ చాపెల్‌కు తాళాలు వేశారు. దాదాపు 12 ఏళ్ల పాటు కొనసాగిన పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 21న పరమపదించిన సంగతి తెలిసిందే.

ఎవరీ లూయిస్ ఆంటోనియో టాగ్లే?

కొత్త పోప్ ఎంపిక రేసులో ఫిలిప్పీన్స్ కార్డినల్ లూయిస్ ఆంటోనియో గోకిమ్ టా గ్లే ముందు వరుసలో ఉన్నారు. ‘ఆసియా పోప్ ఫ్రాన్సిస్’ అని పిలుచుకునే ఆంటోని యో టాగ్లే తదుపరి పోప్‌గా ఎన్నికైతే ఆసి యా ఖండం నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించనున్నారు.

దివంగత పోప్ ఫ్రాన్సిస్ లాగే ఆంటోనియో కూ డా బయట దేశానికి చెందిన వారు కావడం.. యూరోప్‌లో అత్యంత శక్తివంతమైన కేథలిక్ చర్చ్‌ను సమర్థవంతంగా నడిపించగలరని చాలా మంది నమ్మకం. రహస్య ఓటింగ్ ప్రక్రియలోనూ కార్డినల్స్ అంతా ఆయనకే ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ ని తెలుస్తోంది. 1957 ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జన్మించిన ఆంటోనియో టాగ్లే 2015 నుంచి కారిటాస్ అంతర్జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.