calender_icon.png 2 January, 2026 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూచుకుళ్ల కోటలో సోలార్ వెలుగులు!

02-01-2026 12:45:42 AM

  1. సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి మాదిరి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్వగ్రామం తుడుకుర్తిలోనూ ఉచిత విద్యుత్ సౌకర్యం

బల్మూర్ మండలం మరో కొండారెడ్డిపల్లిలోను సోలార్ వెలుగులు

నాగర్‌కర్నూల్, జనవరి 1 (విజయక్రాంతి ):  విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతి సాధిస్తుందంగా విడుదల అయ్యే సూర్యరశ్మి ఆధారంగా సోలార్ ప్యానల్ ద్వారా విద్యుత్ వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా నిరుపేదల ఇంటికి సోలార్ పవర్ పాయింట్ అందిస్తోంది. ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండారెడ్డిపల్లి, నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి సోలార్ ప్యానల్ బిగించి దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా రూపుదిద్దుకుంది.

ప్రతి ఇంట్లో సుమారు 200 యూనిట్లు విద్యుత్తు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్తును ప్రభుత్వమే తిరిగి కొనుగోలు చేసి లబ్ధిదారుడి ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా రూపాకల్పన చేశారు. దాంతోపాటు రైతులు పంట పొలాల వద్ద బోర్లకు సైతం సోలార్ పవర్ ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా సౌర జల వికాసం పథకం ద్వారా గిరిజన రైతులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది.

అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలోని గిరిజన రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. స్వయం సమృద్ధి పొందాలన్న లక్ష్యంతో సబ్సిడీ ద్వారా ఈ పథకాన్ని వర్తింపజేశారు. ప్రస్తుతం ఈ పథకం విజయం సాధించగా నిరుపేదల ఇళ్లల్లోనూ వెలుగులు నింపాలన్న లక్ష్యంతో ఉమ్మడి జిల్లాలోని మూడు గ్రామాలను ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి గ్రామంలో 50 శాతం మంది ఇళ్లల్లో ఈ సోలార్ విద్యుత్ దీపాలను వెలిగిస్తున్నారు. 

కూచుకుళ్ళ కోటలో సోలార్ వెలుగులు..!

 నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తన కుమారుడు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి స్వగ్రామం నాగర్ కర్నూల్ మండలం తోడుకుర్తి గ్రామంలోని నిరుపేదలకు సోలార్ విద్యుత్ దీపాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది మొదటి విడతగా 790 మంది ఇళ్లలపై ఒక సోలార్ ప్లాంట్ 1.60 వేల విలువజేసే సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తోంది.

దాంతోపాటు అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం మరో కొండారెడ్డిపల్లి గ్రామంలోనూ సుమారు 200 ఇళ్లపై ఈ సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అర్హత ఆసక్తి గల గ్రామస్తుల నుండి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభించారు.

మా గ్రామానికి మంజూరు కావడం అదృష్టంగా భావిస్తున్నాం

 ఈ మధ్య జరిగిన గ్రామపం చాయతీ ఎన్నికల్లో నాపై నమ్మకం నుండి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించారు. తుడుకుర్తి సొంత గ్రామాన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కృషి వల్ల ఈ గ్రామానికి సోలార్ విద్యుత్ వెలుగులు వస్తున్నాయి. మొదటి విడతలో నిరుపేదలను గుర్తించి రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా చర్యలు తీసుకుంటాం.

 లక్ష్మీ కరుణాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్, తూడుకుర్తి.