13-10-2025 07:20:17 PM
హుజూరాబాద్,(విజయక్రాంతి): సీఎస్ఐ కరీంనగర్ రీజియన్ వైస్ చైర్మన్ గా కరీంనగర్ జిల్లాహుజూరాబాద్ పట్టణానికి చెందిన సొల్లు సుదర్శన్ రెండో సారి ఎన్నికయ్యారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలను కరీంనగర్ రీజియన్ గా పరిగణిస్తారు. సోమవారం కరీంనగర్ లోని సిఎస్ఐ చర్చిలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలో సొల్లు సుదర్శన్ కు 266 ఓట్లకు గాను 236 ఓట్లు రాగా వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. చైర్మన్ గా బిషప్ వ్యవహరిస్తారు. సెక్రటరీలుగా పురుషోత్తం, ఎర్ర జాకబ్, ట్రెజరరీగా రాము ఇమ్మాన్యూయేల్ ఎన్నికయ్యారు. సొల్లు సుదర్శన్ ఎన్నిక పట్ల తన కుమారుడు సొల్లు థామస్, సొల్లు బాబు, పుష్పలత తోపాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.