14-10-2025 01:27:42 AM
- అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
రంగారెడ్డి,అక్టోబర్13( విజయక్రాంతి): వానాకాలం సీజన్లో రైతులు పండించిన పంటలు అమ్ముకునేందుకు వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కొరత లేకుండా రైతులందరికి ఎరువులు అందేలా చూడాలని, పత్తి కొనుగోలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో సరిపడా గన్ని బ్యాగులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఇందిరమ్మ ఇండ్లకు స్టేజ్ వారీగా పేమెంట్ అయ్యేలా చూడాలని, స్థానిక ఎన్నికల కోడ్ కు ముందు వచ్చిన లిస్ట్ ప్రకారం ఇండ్ల గ్రౌండింగ్ చేయాలని పిడి హౌసింగ్ అధికారికి సూచించారు. గ్రామ, మున్సిపల్ స్థాయిలో పరిశుద్ద్యం పై శ్రద్ద పెట్టాలని తెలిపారు. ప్రతి ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను ముందు ఉంచేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని అన్నారు. ప్రతి వారం సంబంధిత అధికారులతో ప్రభుత్వ పథకాల అమలు పై, చేపట్టిన చర్యల పై కింది స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లేదా టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాలని తెలిపారు. నెలకు ఒకసారి ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో పల్స్ పోలియో చుక్కలను ఏ ఒక్కరినీ వదలకుండా ఇంటింటికి వెళ్ళి వేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి తెలిపారు.
ప్రజావాణికి (48 ) ఫిర్యాదులు....
అంతకుముందు జిల్లా సమీకృత సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (48) ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి,నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. దరఖాస్తులను తరగతి గతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. దరఖాస్తులు ఇలా రెవెన్యూ శాఖ%--%15, ఇతర శాఖలు 33, మొత్తం 48 దరఖస్తులు అందాయి.