calender_icon.png 14 October, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓవర్సీస్ విద్యానిధికి పెరిగిన లబ్ధిదారులు

14-10-2025 01:28:52 AM

హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యా నిధి కింద లబ్ధిదారుల సంఖ్య గతంలో కంటే పెరిగింది. గతంలో మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యా నిధి బీసీ లబ్ధిదారుల సంఖ్య 300 ఉంటే ఇప్పుడు 700కు చేరింది. బీసీ- బీసీణె కలిపితే మొత్తం 1,000 మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద ఎస్సీలకు గతంలో 210 మందికే అవకాశముంటే ఇప్పుడు 500 మందికి లబ్ధి జరుగుతోంది. ఎస్టీల్లో గతంలో 100.. ఇప్పుడు 200 మంది లబ్ధిదారులున్నారు.

గతంలో ఈ పథకాల ద్వారా లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్య 610గా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అదికాస్త పెరిగి 1,400కు చేరింది. అంటే ఏకంగా 130 శాతానికి పెరిగింది. సీఎం రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విదేశాల్లోని ప్రఖ్యాత అంతర్జాతీయ వర్సిటీల్లో చదివే తెలంగాణ విద్యార్థుల సంఖ్య పెరుగనుంది.