11-05-2025 12:00:00 AM
ఈ ఆధునిక యుగంలో అమ్మలు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లగలుగుతున్నారు. తద్వారా ఇతరులపై ఆధారపడకుండా తమ పనుల్ని తామే స్వయంగా చేసుకోగలుగుతున్నారు. కెరీర్ పరంగా రాణిస్తూ.. వృద్ధి చెందుతున్నారు. ఇలాంటి వారికి సోలో ప్రయాణా లు అవసరం అంటున్నారు నిపుణులు. ఒంటరిగా ప్రయాణాలు చేయడం వల్ల అమ్మలకు రోజువారీ బరువు బాధ్యతల నుంచి కాస్త విశ్రాంతి లభిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
* ఒంటరిగా ప్రయాణాల వల్ల శరీరానికి, మనసుకు విశ్రాంతి దొరుకుతుంది. ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. ఇది పరోక్షంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
* సోలోగా ప్రయాణించడం వల్ల ఇతరుల నిర్ణయాలు వారిపై రుద్దే అవకాశం ఉండదు. అది సాహసమైనా, ఇతర విషయాల్లోనైనా స్వయంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వెళ్లిన చోట తమకు నచ్చినట్టుగా ఉండగలుగుతారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
* ఇంట్లో ఉన్నంతసేపు కుటుంబ సభ్యుల గురించిన ఆలోచనలే అమ్మల మదిలో మెదులుతాయి. తమ ఆలోచనల్ని, అభిరుచుల్ని పక్కన పెట్టేస్తుంటారు. వాటిపై దృష్టి సారించడానికి ఈ ఒంటరి ప్రయాణం ఉపయోగపడుతుంది.
* కొత్త ప్రదేశాల్ని, కొత్త వ్యక్తుల్ని కలుసుకొనే అవకాశం కూడా ఈ ఒంటరి ప్ర యాణాలు అమ్మలకు అందిస్తాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోగలుగుతారు. ఇవి వారికి వ్యక్తిగతంగానే కాదు.. కెరీర్‌లోనూ ముందుకెళ్లడానికి ఉపయోగపడతాయి.
* కొంతమంది అమ్మలకు మాతృభాష త ప్ప మరో భాష రాకపోవచ్చు.. లేదంటే అప్పుడప్పుడే ఇతర భాషలు నేర్చుకుంటుండవచ్చు.. ఇలాంటివారు కొత్త ప్రదేశాలకు వెళ్తే అక్కడి భాషల్నీ నేర్చుకునే అవకాశం దొరుకుతుందంటున్నా రు నిపుణులు.
* ఒంటిగా ప్రయాణాల వల్ల అమ్మలు త మ గురించి తాము బోలెడన్ని విషయా లు తెలుసుకోగలుగుతారంటున్నారు ని పుణులు. తమ ఇష్టాయిష్టాలు, అభిరుచులు, ఆహార కోరికలు.. వంటివన్నీ వా రికి అవగతమవుతాయి. ఇవీ వారిని పునరుత్తేజితం చేసేందుకు దోహదపడతాయి.