calender_icon.png 3 November, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలనీ సమస్యలు పరిష్కరించండి సారూ

03-11-2025 02:57:59 AM

ఘట్ కేసర్, నవంబర్ 2 (విజయక్రాంతి): తమ కాలనీలో నెలకొని ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని విహారి హోమ్స్ కాలనీ ప్రజలు ప్రభుత్వ అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలను వేడుకుంటు న్నారు. విహారి హోమ్స్ కాలనీ సమస్యలపై అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడంలేదని, మేము కేవలం ఓట్లు వేయడానికి, సకాలంలో పూర్తి స్థాయి పన్నులు చెల్లించడానికి తప్ప మా కాలనీ అభివృద్ధి, నమస్యలు పట్టిచుకునే వారు కనిపించడం లేదని విహారీ హోమ్స్ కాలనీ వాసులు మండిపడ్డారు.

పోచారం మున్సిపల్ ఇస్మాయిల్ ఖాన్ గూడ పరిధిలోని విహారి హోమ్స్ కాలనీ అధ్యక్షుడు కొక్కు ప్రభాకర్ ఆధ్వర్యంలో కాలనీ పెద్దలు కాలనీలో నెలకొని ఉన్న ప్రధాన సమస్యలను విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు సార్లు స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులుగా ఈటల రాజేందర్ ను కాలనీ నుండి రాజకీయాలకు అతీతంగా మెజారిటీ ఓట్లు వేసి వారి గెలుపు కోసం కృషి చేసినప్పటికి ఏఒక్క నాడు వారు కాలనీ సమస్యలు పట్టించుకున్న  దాఖలాలు లేవని వాపోయారు.

కాలనీలో 310 కుటుంబాలతో 800 మంది నివాసం ఉంటున్నారని, అందరు ప్రభుత్వ ఉద్యోగులై పదవి విరమణ పొందినప్పటికీ కాలనీలో రోడ్లన్ని గుంతల మమైనాయని, వర్షాలు పడి సమయంలో గుంతలలో పడి ప్రమాదాలకు గురైన సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక రోడ్లపై మురుగు నీరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ నుండి నకాలంలో పూర్తి స్థాయిలో పన్నులు చెల్లిస్తున్నప్పటికి మున్సిపాలిటీ నుండి మౌలిక సదుపాయాలు కల్పించాల్పిన అధికారులు సహితం కాలనీ వైపు చూడడం లేదని మండిపడ్డారు.

కాలనీలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని కమిషనర్ కు మొరపెట్టుకున్న ప్రయోజం లేదని వాపోయారు. ఇప్పటికైన అధికారులు స్పందించి తమ కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు సమస్య లు పరిష్కారించే విధంగా కృషి చేయాలని లేదంటే ఆందోళన బాట పట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈసమావేశంలో కాలసీ పెద్దలు నర్సయ్య, బాలరాజ్, దయాసింగ్, బిక్షపతి, సుబ్రమణ్యం నాయుడు, వెంకటేష్, పిండర్, మోహన్ చారి, బాబురావు, విజయ్ కుమార్, వర్మ, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.