03-11-2025 03:00:18 AM
అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 2: పెద్ద అంబర్‌పేట్ జనత చైనత్య హౌసింగ్ కార్పొరేషన్ జీపీ లే అవుట్‌లోని 1100 గజాల ఓపెన్ స్థలం, పార్కు స్థలం ను కొందరు అక్రమార్కులు కబ్జాచేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఆ స్థలం విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ.5 కోట్లు ఉంటుంది.... దీంతో కబ్జా రాయుళ్లపై “విజయక్రాంతి” దినపత్రికలో వరస కథనలు ప్రచరితమయ్యాయి. దీంతో స మున్సిపల్ అధికారులు స్పందించారు.
మున్సిపల్ యాక్ట్ 2055 ప్రకారం కబ్జాకు గురై పార్కు స్థలాలను స్వాధీనం చేసుకునే వెలుసుబాటు ఉండడంతో.... మున్సిపల్ కమిషనర్ అట్టి పార్కు స్థలాల కబ్జాకు సంబంధించిన డాక్యుమెంట్లు రద్దు చేయలని సబ్ రిజస్టార్‌కు ఫిర్యాదులు చేయగా.. సబ్ రిజిస్టార్ అట్టి డాక్యుమెంట్లను రద్దు చేశారు. అయితే అట్టి నిర్మాణాలకు కూల్చివేతలో అధికారులు కొంత అలస్వతం ప్రదర్శిస్తున్నారు.
అక్రమ రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు రద్దు
పెద్ద అంబర్‌పేట్ సర్వే నెంబర్ 153, 168లో జీపీ లే అవుట్‌లోని పార్కు స్థలం, ఓపెన్ స్థలాల అక్రమంగా రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని మున్సిపల్ కమిషనర్ పెద్ద అంబర్‌పేట్ సబ్‌రిజిస్టార్ ఫిర్యాదులు చేయడంతో వాటిని 29/--10/2025 రద్దు చేశారు. రద్దు అయిన డ్యాక్యుమెంట్ నెంబర్ 2085/2025 సంబంధించిన 322.66 చ.గలు. ప్లాట్ నెంబర్ 35 ఈస్ట్ ప్లాట్, 36 ఈస్ట్ ఉప్పు సౌందర్య చెందిన డాక్యుమెంట్ రద్దుంది. అందే విధంగా 2086/2025లకు సంబంధించి 326.34 ఆకుల శీరిష, ఆకుల స్వప్ప, అలాగే డాక్యుమెంట్ నెంబర్ 2088/2025 ప్లాట్ల్ నెంబర్ 40, 473 చ. గజాల ఆకుల లక్ష్మీదీప, ఆకుల భాగ్యలక్ష్మీ, ఆకుల లతశ్రీ చెందిన కాన్సెల్ అయ్యాయి.
నిర్మాణాలపై చర్యలెప్పుడో..!
పెద్ద అంబర్‌పేట్ సర్వే నెంబర్ 153, 168లలో జనత చైనత్య హౌసింగ్ కార్పొరేషన్ జీపీ లే అవుట్ సంబంధించిన పార్కు స్థలం, ఓపెన్ స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు రద్దు చేశారని కానీ.. అందులో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాలనీ వాసులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడానికి ఎందుకు లాలుచిపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆ అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకుని... పార్కు స్థలాన్ని రక్షించి.. చుట్టు పెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.