03-11-2025 09:02:34 PM
అమీన్ పూర్: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని అమీన్ పూర్ గ్రామంలో పురాతన దేవాలయం అయినటువంటి ఈదమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సోమవారం నాడు ఏర్పాటుచేసిన ఈదమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో అమీన్ పూర్ గౌడ సంఘం, ఈదమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ యొక్క కార్యక్రమానికి అమీన్ పూర్ మున్సిపాలిటీ, గౌడ సంఘ నాయకులు గ్రామస్తులు గ్రామ పెద్దలు హాజరయ్యారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నర్సింహా గౌడ్ ను వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈదమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.