calender_icon.png 23 July, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించండి

23-07-2025 01:23:49 AM

ప్రభుత్వానికి దివ్యాంగుల హక్కుల పోరాట సమితి విజ్ఞప్తి 

ఖైరతాబాద్;జూలై 22 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని  వికలాంగుల హక్కు ల పోరాట సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న దివ్యాంగులకు ఇచ్చిన హామీల ను నెరవేర్చాలేదని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశా రు. ఎన్నికల హామీ ప్రకారం దివ్యాంగులకు 6000 రూపాయలు తీవ్ర వైకల్యం ఉన్నవారికి 15000 రూపాయలు ఎన్నికల హామీ తేదీ నుంచి ఇప్పటిి వరకు వెంటనే చెల్లించాలని అన్నారు.

ఎఐసిసి ఎన్నికల హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలలో దివ్యాంగులకు రిజర్వేషన్ ప్రకటిస్తూ ఆర్డినెన్స్ తేవాలని అన్నారు. అన్ని రకాల ఆర్టిసి బస్సులలో ఉచిత రవాణ సౌకర్యం కల్పించాలి, ఆర్టిసి లో 4శాతం బ్యాక్లాగ్ ఉద్యోగాలు, వ్యాపార సముదాయాలలో 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వి హెచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అందే రాంబా బు, జాతీయ ముసాయిదా కమిటీ వైస్ చైర్మన్ చెరుకు నాగభూషణం, జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.