23-07-2025 01:25:18 AM
చర్లపల్లి క్యాంపస్ సందర్శన
కాప్రా, జూలై 22(విజయక్రాంతి) : సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) చర్లపల్లి క్యాంపస్ను జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె క్యాంపస్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, హాస్టల్ సౌకర్యాలను పరిశీలించారు. అలాగే, శిక్షణలో ఉన్న యువతతో ముఖాముఖి సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల సహకారంతో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందిస్తున్న సిపెట్ సంస్థ సేవలను కార్పొరేటర్ ప్రశంసించారు. యువతకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపెట్ ప్రిన్సిపల్ డైరెక్టర్ అండ్ హెడ్ బి. రవి, మేనేజర్ అండ్ స్కిల్ హెడ్ బి. శ్రీకర్, మేనేజర్ అండ్ ట్రైనింగ్ హెడ్ డి. ఆంజనేయ శర్మ, డివిజన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.