11-09-2025 01:04:29 AM
-రెండోసారి ఇండియా ట్రావెల్ అవార్డు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన, ప్రముఖ ప్రయాణ సంస్థలలో ఒకటైన సదరన్ ట్రావెల్స్ పర్యాటక రంగంలో తన అసాధారణమైన సేవలకు మరోసారి గుర్తింపు పొందింది. 2025 ఇండి యా ట్రావెల్ అవార్డ్స్ ట్రావెలర్స్ చాయిస్ ఎక్సలెన్స్ అవార్డును మంగళవారం న్యూఢిల్లీలో ఘన కార్యక్రమంలో అందుకుంది.
ఈ అవార్డును మరోసారి అందుకోవడం ద్వారా సదరన్ ట్రావెల్స్ తన విశిష్ట స్థానాన్ని తిరిగి నిరూపించుకుంది. ఈ అవార్డును కేంద్ర ప ర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శేఖావత్, సుమన్ బిల్లా (డైరెక్టర్ జనరల్, పర్యాటక శాఖ, భారత ప్రభు త్వం), అశ్విని లోహాని (సభ్యులు, జాతీయ పర్యాటక సల హా మండలి) అందజేశారు.
సదరన్ ట్రావె ల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ అలపాటి మాట్లాడుతూ.. “2025 ఇండియా ట్రావెల్ అవార్డు రెండోసారి అందుకోవడం మాకు గొప్ప గౌరవం. మా కస్టమర్ల విశ్వా సం, మరియు మా సంస్థ సిబ్బంది అం కితభావంతో చేసిన కృషికి ఇది గుర్తింపు” అన్నారు.