calender_icon.png 27 August, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి గణపతే ముద్దు

27-08-2025 12:00:00 AM

 సత్యం గ్రూప్స్ చైర్మన్ గంట రవికుమార్ 

వరంగల్ ఆగస్టు 26(విజయ క్రాంతి): వరంగల్ నగరంలో రంగశాయిపేట లోని లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల యందు ప్రధానోపాధ్యాయులు షేర్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు మట్టి గణపతుల పంపిణీ చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్యం గ్రూప్స్ చైర్మన్ గంట రవికు మార్ హాజరై విద్యార్థులకు గణపతులను పంపిణీ చేశారు.

మట్టి_విగ్రహాలను పూజిస్తే పర్యావర ణానికి ఎంతో శ్రేయస్కరము అలాగే సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే ముడిసరుకుతో చేసే వినాయక ప్రతిమలనే పూజించాలని హైంధవ పురాణాలు కూడా చెబుతున్నాయి. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ మట్టికి మనిషికి విడదీయరాని బంధమని , ఒక్కమాటలో చెప్పాలంటే మానవ మనుగడ ప్రకృతితో ముడిపడి ఉందని,ప్రకృతి ఆరాధనతో మొదలైన పూజలు ఇప్పుడు విగ్రహ ఆరాధన వరకు వచ్చాయన్నారు. 

జిల్లాలో వేల సంఖ్యల్లో పెద్ద విగ్రహాలను మండపాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహాల వల్ల పర్యావరణానికి పెనుముప్పు సంభవించే ప్రమాదముం దని విద్యావంతులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.సహజ సిద్ధంగా లభించే బంకమట్టితో చేసే విగ్రహాలు త్వరగా నీటిలో కరిగిపోతాయి కాబట్టి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసినా నీటి వనరులకు ఎలాంటి నష్టం  ఉండదన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది బిజెపి కార్యకర్తలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.