calender_icon.png 24 August, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బావిలో దూకి భర్త ఆత్మహత్య..

23-08-2025 07:56:29 PM

నెల రోజుల క్రితం అదే బావిలో భార్య సూసైడ్.. 

అదిలాబాద్ (విజయక్రాంతి): వ్యవసాయ బావిలో దూకి భార్య ఆత్మహత్య చేసుకున్న అదే బావిలో, కొన్నాళ్ళకు భర్త సైతం దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్ఐ రాధిక(SI Radhika) తెలిపిన వివరాల ప్రకారం... తలమడుగు మండలం బరంపూర్ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో శనివారం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గమనించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి, విచారించగా ఆదిలాబాద్ లోని రామ్ నగర్ కాలనీకి చెందిన దేవి ప్రసాద్ అనే వ్యక్తి మృతదేహంగా గుర్తించారు.

ఇదిలా ఉండగా గత నెల రోజుల క్రితం దేవి ప్రసాద్ భార్య సుహాసిని సైతం ఇదే బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. భర్త దేవి ప్రసాద్ వేధింపులతో తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని సుహాసిని కుటుంబ సభ్యులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా దేవి ప్రసాద్ పై కేసు నమోదు చేశారు. అయితే తనపై కేసు నమోదు కావడంతో పాటు భార్య తరపు వారి బెదిరింపులతో మనస్థాపం చెందిన భర్త దేవి ప్రసాద్, భార్య ఆత్మహత్య చేసుకున్న బావిలోనే దూకి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మృతదేహాన్ని సుకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై రాధిక తెలిపారు.