calender_icon.png 28 May, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొర్రూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

30-04-2025 07:00:17 PM

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy) అన్నారు. పట్టణంలోని చెరువు కట్ట పనులను ఎమ్మెల్యే బుధవారం పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డితో కలిసి ప్రారంభించారు. చెరువు కట్ట మరమ్మత్తు పనులను స్వయంగా ఎమ్మెల్యే జెసిబి నడిపి ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... చెరువు కట్టకు పటిష్టమైన మరమ్మత్తు పనులను చేసి, మినీ ట్యాంక్ బండ్ గా రూపొందిస్తామని, కట్టను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పారు. చెరువు కట్ట మరమ్మత్తు పనులు తొర్రూరు పట్టణ అభివృద్ధిలో కీలక ఘట్టంగా పేర్కొన్నారు.