28-05-2025 12:09:21 AM
మహబూబ్‌నగర్, మే 27 (విజయ క్రాంతి) : భూములకు రోజురోజుకు డిమాం డ్ విపరీతంగా పెరిగిపోతుంది. నేడు ఉన్న భూముల ధరలకు రేపు రెట్టింపు అవుతుండడంతో పట్టాదారులలో మార్పు వస్తుందని ఆరోపణలో బలంగా వస్తున్నాయి. ముందు గా ఎంఓయూ, ఒప్పందాలు, జిపిఏలు చేసి తర్వాత మీకు మాకు సంబంధం లేదు మా భూములు మాకు ఇష్టం వచ్చిన వారికి అమ్ముకుంటామనే విధానాలకు ఈ మధ్యకాలంలో అత్యధికంగా తెరలేపుతున్నారు.
కాస్త వివాదాలు ఉంటే చాలు ఎంతోమంది ఆ భూములపై కన్నేసి మేమంటే మేము పరిష్కరిస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఎం దుకు డబ్బులకు డబ్బులు ..భూములకు భూములు వరిస్తాయని ఆశే ఎంతోమందిని ముందుకు వచ్చేలా చేస్తున్నాయి. ఒప్పందాలు చేసుకొని మోసపోతున్న వ్యక్తులు కో ర్టు మెట్లు ఎక్కి మాకు న్యాయం కావాలంటున్నారు. రోజురోజుకు పాలమూరు భూము లు కోర్టు మెట్లు ఎక్కుతూ తీవ్ర చర్చినియాఅంశంగా మారుతున్నాయి.
-234, 235 భూములపై ఫిర్యాదు..
రెవెన్యూ గ్రామంలోని సర్వేనెంబర్ 234, 235 లలో వారసత్వంగా వచ్చిన భూ మి 2006 సంవత్సరంలో పట్టాదారులు రవీందర్ రెడ్డి కి 5 ఎకరాల18 గుంటల భూమితో పాటు మరో 6 ఎకరాల 34 గుంటల భూమిని ఎంఓ యు అగ్రిమెంట్ ఒప్పందం ద్వారా రవీందర్ రెడ్డి చేసుకున్నారని తెలుస్తుంది. బాకీ పడిన మిగతా సొమ్ము 2008లో నగదు చెల్లించినట్లు రవీందర్ రెడ్డి చెబుతున్నారు.
ఆంధ్ర బ్యాంకులో రవీందర్ రెడ్డికి అగ్రికల్చర్ తనా క రుణాలకు గ్యారెంటర్ గా హామీ ఇస్తూ సంతకాలు చేశారు, ఈ ఒప్పందంలో భాగం గా 12 ఎకరాల 12 గుంటల భూమి ఆంధ్ర బ్యాంకులో భాగ్యమ్మ మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేసినట్లు ఒప్పంద పత్రాలు చెబుతున్నాయి. ఎంఓయు ఒప్పందం ప్రకా రం ఈ భూమికి సంబంధించిన బ్యాంకు లోన్ పూర్తిచేసుకుని రిజిస్ట్రేషన్ చేయాలని పలుమార్లు రవీందర్ రెడ్డి భూ యజమానిని సంప్రదించిన రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేశారని రవీందర్ రెడ్డి పేర్కొంటున్నారు.
బ్యాం కు మార్టీగేజ్ లోన్ లో ఉన్న భూమిని రెవె న్యూ అధికారులు ఫిబ్రవరి నెలలో ఎలాంటి హద్దులు లేకుండా పట్టాదారురాలు వారి ముగ్గురు కూతుర్లపై 27 గుంటల చొప్పున మొత్తం 2.1ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రవీందర్ రెడ్డి ఇచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ అంత గిఫ్ట్ డెడ్ కింద రిజిస్ట్రేషన్ చేశారు, మిగతా భూమిని సిరి వెంచర్ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు.
దీంతో ఎంఓయూ ఒప్పందందారు రవీందర్ రెడ్డి రాష్ట్ర హైకోర్టు లో పట్టాదారురాలు పై దావా వేశారు. ప్రస్తుతం ఈ భూమిపై స్టేటస్ స్కో కేసు నెంబర్ wp14373) 2025 ఆర్డర్ ను హైకోర్టు, అలాగే జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో కేసు నెంబర్ o6/2025 మరో దావా రవీందర్ రెడ్డి వేయడంతో సెటస్ స్కో ఆర్డర్ నంబర్ ఐ ఏ నం బర్ 27/2025 ద్వారా ఉత్తర్వులు జారీ అ య్యాయి.
ఈ భూముల్లో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి లావాదేవీలు జరపకూడదని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొంది, ఇవేమీ ఇబ్బందులు పట్టించుకోకుండా ఆంధ్ర బ్యాంకు లో మార్టీగేజ్ భూ ములను రెవెన్యూ అధికారులు నిబంధనలు ఉల్లంఘించి రిజిస్ట్రేషన్ చేసినట్లు రవీందర్ రెడ్డి పేర్కొంటున్నారు.
ఓ ప్రక్రియ జరిగింది ఇలా...
ఏదిరా రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్234, 235లో డాక్యుమెంట్ ఫైల్ నెంబ ర్ జి/26/1989 సంవత్సరములో సయ్యద్ ఇఫ్తాకారుద్దీన్ పేరుపై రెండు సర్వే నెంబర్లలో 21 ఎకరాల 33 గుంటల భూమి రికార్డులో ఉంది. 1990లో కాంగీ దస్తావేజు ద్వారా కృ ష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, నారాయణరెడ్డిలు ఈ భూమిని కొనుగోలు చేశారు, ఈ మొత్తం ఎక్స్ టెంట్ లో రైల్వే ట్రాక్తో పాటు విద్యుత్తు లైనుకు మరికొంత భూమిలో పోయిందని తెలుస్తుంది.
దీంతో ఈ భూమి 21 ఎకరాల 30 మూడు గుంటలకు గాను ప్రస్తుతం 15 ఎకరాలు మాత్రమే ఉందని బాధితులు తెలిపారు. ఈ భాగస్తులు కృష్ణారెడ్డి నుండి సర్వే నెంబర్ 235లో 1ఎకరం 35 గుంటల భూ మి, గోపాల్ రెడ్డి నుండి 2 ఎకరాల 29 గుం టల భూమి, సువర్ణమ్మ నుండి 1 ఎకరా 36 గుంటల భూమిని రవీందర్ రెడ్డి కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఈ ఏడాది మార్చి 13న పోలీస్ స్టేషన్లో సర్వేనెంబర్ 234, 235ల పై ఎం ఓ యు ఒప్పందం చేసుకొని తనక ద్వా రా బ్యాంకు లోన్ తీసుకున్న భూమిని అక్ర మ రిజిస్ట్రేషన్లు చేసిన భాగ్యమ్మ , తాహసిల్దార్ పేరుపై రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫి ర్యాదు చేశానని రవీందర్ రెడ్డి తెలిపారు.
భూముల వ్యవహారం పై పూర్తి విచారణ చే సి కోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలని బాధితులు రవీందర్ రెడ్డి కోరుతు న్నారు. ఈ విషయాలపై పూర్తిస్థాయిలో ని వేదికలు సమర్పిస్తూ డిజిపి, జిల్లా కలెక్టర్, జి ల్లా ఎస్పీ లతోపాటు వివిధ విభాగాల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలియజేశారు.
కొత్త చట్టంతో భూ సమస్యలు పరిష్కారం అయ్యేనా..?
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో ఎ న్నో లోటుపాట్లు ఉన్నాయని ప్రజా పాలన ప్రభుత్వము భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. భూ ప్రక్రియ జరుగుతున్న సమ యంలోనే భూ కొలతలు కూడా నిర్ణయించాలని ఈ చట్టం చెబుతుంది. ఈ చట్టం పూ ర్తిస్థాయిలో అమలు అయితే భూ సమస్యల కు భవిష్యత్తులో తావు ఉండదనే ఆలోచన ప్రజల్లో కలుగుతుంది.
ప్రభుత్వం సమగ్రం గా ఈ చట్టాన్ని అమలు చేయాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రజా ప్రతినిధు లు సైతం భూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు. ఇలా చేయడం ద్వారా భూత గదల కు ముగింపు పలికే అవకాశం ఉంది.