calender_icon.png 29 May, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ పడిగాపులు

28-05-2025 12:17:17 AM

-ఢిల్లీలో అపాయింట్‌మెంట్ ఇవ్వని రాహుల్

-ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమే

-మోదీని ప్రపంచమంతా కీర్తిస్తుంటే ఖర్గే విషం చిమ్ముతున్నారు

-బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ వ్యాఖ్యలు

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): ఢిల్లీలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి మూడురోజుల పాటు పడిగాపులు కాసి నా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కనీసం ఆయనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేద ని, ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీ య అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ విమర్శించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడి యా సమావేశం నిర్వహించా రు. రేవంత్‌రెడ్డి 3 రోజులు ఢిల్లీ లో పడిగాపులు పడ్డారని.. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని విమర్శించారు. గతం లో సీఎంగా ఉన్న అంజయ్యకు కూడా ఇలాంటి అవమానం జరిగిందన్నారు.

ఢిల్లీకి వెళ్లి కలవడంలో తప్పులే దని.. కానీ ఇలా పడిగాపులు పడడం రాష్ట్ర ప్రజలకు  అవమానమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే వి షం చిమ్మారని లక్ష్మణ్ ఆరోపించా రు. మోదీ హయాంలో భారత్.. ప్ర పంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందన్నారు. పేదరి కం అనుభవించి ప్రధాని అయిన మోదీని రాహుల్ గాంధీ కులంపేరుతో దూషించారని ఆరోపించారు. 

మనకు గర్వకారణం కాదా..

ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట పెరుగుతుంటే.. మోదీని సమర్ధ నాయకునిగా కీర్తిస్తుంటే గర్వకారణం కాదా అనేది ఖర్గే చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ లాంటి దాడులు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ నాయకులు సహకరించినా.. లేకున్నా.. లేదా నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరైనా, కాకపోయినా  మోదీ అభివృద్ధి దృక్పథం ఏమాత్రం మారదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రాజకీయ పార్టీల కుటుంబాలు వారస త్వ రాజకీయాల కోసం, ఆస్తుల పంపకాల కోసం పరస్పరం రాజకీయంగా కక్షలు పెంచుకుంటున్నా యన్నారు. బీజేపీ వారసత్వ రాజకీయాలపై ఆసక్తి చూపద న్నారు. 

ఆయుధాలు వదలాలి..

చర్చలు కావాలంటే ముందుగా ఆయుధాలు వదలాలని.. అప్పుడే చర్చలకు అర్థం ఉంటుందని లక్ష్మణ్ అన్నారు. ఇప్పటికే కొన్ని పార్టీల నేతలు సైన్యంపై అవాంఛనీయ వ్యాఖ్యలు చేశాయన్నారు. భారత్ ప్రపంచ దేశాలన్నింటితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుందని.. కానీ ఎవరైనా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తే, దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తే తగిన జవాబు ఇస్తుందన్నారు. సర్జికల్ స్ట్రుక్ జరిగిందా.. దోమ నైనా చంపారా అంటూ మాట్లాడినవారు బీఆర్‌ఎస్ నాయకులేనని తెలిపారు.