28-05-2025 12:31:59 AM
- రెండు నెలలైనా పూర్తికాని యాసంగి కొనుగోళ్లు
- కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్న రైతులు
- అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యం
- వడ్లు మొలకలెత్తడంతో తిప్పలు
- వేధిస్తున్న లారీల కొరత, మిల్లర్ల ఇబ్బందులు
- కొనుగోళ్లలో అధికారుల జాప్యం
- ఖరీప్ సాగుకు ఆలస్యంపై ఆందోళన
విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, మే 27: రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనేందుకు దాదాపు రెండు నెలల క్రితమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు చాలా జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తికాలేదు.
అకాల వర్షాలకు ధాన్యం తడుస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తేమ శాతం, తాలు వంటి సమస్యలతో కేంద్రాల్లోనే రోజుల తరబడి ఉన్నా కొనుగోలు చేస్తారో కూడా తెలియని పరిస్థితి. దీంతో పంటను అమ్ముకోలేక, దాచుకోలేక నష్టపోతున్నామని రైతులు గోస పడుతున్నారు.
ధాన్యం అమ్ముకోవడానికి మార్కెట్‌కి వెళ్తే తూకం పేరుతో దోపిడీకి గురి చేస్తున్నా రు. ప్రతి గోనె సంచిలో 40 కిలోల ధాన్యం నింపుతున్నారు. అయితే సంచి బరువును నిర్ణయించా ల్సి ఉండగా అందుకోసం 4.650 కిలోల ధాన్యం తూకం వేయాల్సి ఉంటుంది.
కానీ కొనుగోలు కేం ద్రాల్లో దాదాపు 43 కేజీల వరకు ధాన్యం తూకం వేస్తున్నారు. రైతుల ధాన్యాన్ని అక్రమంగా కాజేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకు లు, అధికారులు కుమ్మక్కు అయినట్లు తెలిసింది.
జిల్లాల వారీగా కొనుగోళ్లు
వనపర్తి జిల్లాలో యాసంగికి 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్ 5వ నుంచి నేటి వరకు 2 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.
గద్వాల జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యానికి చేరువలో ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా.. ఇప్పటికే 80 వేల మెట్రిక్ టన్నులు కొన్నట్టు అధికారులు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో లక్షా 90 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికార యంత్రాంగం ఇప్పటివరకు లక్ష 36 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.
కరీంనగర్ జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. జిల్లాలో 325 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,98,743 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 49,388 మంది రైతులకు చెందిన 693.06 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటికే 46,458 మంది రైతులకు రూ.652.39 కోట్లు చెల్లించారు. ఇంకా 40.66 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. జగిత్యాల జిల్లాలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు.
ఇప్పటి వరకు 4.20 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయింది. మరో 30 వేల టన్నుల వరకు వరి ధాన్యం సేకరించాల్సి ఉంది. మే 31 వరకు పూర్తిగా సేకరించేందుకు అధికారిక కసరత్తు కొనసాగుతున్నది. నిర్మల్ జిల్లాలో లక్ష 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 80 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిం ది. మెదక్ జిల్లాలో 3.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు.
ఇప్పటి వరకు జిల్లాలో 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందుకు సంబంధించి రూ.426.52 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లాలో 2,07,456 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు.
1,52,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడానికి అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 1,18,000 మెట్రిల్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇంకా 34,000 మెట్రిల్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు రైతుల వద్ద సేకరించిన ధాన్యానికి 17,854 రైతులకు రూ.216.65 కోట్లు ఖాతాల్లో జమ చేశారు.
సిద్దిపేట జిల్లాలో 16,43,993 క్వింటాళ్ల దొడ్డు రకం వడ్లు కొన్నారు. 30,289 క్వింటాళ్ల సన్న రకం వడ్లు కొన్నారు. వికారాబాద్ జిల్లాలో 2.25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి 40 రోజులు కావస్తున్నా కేవలం 17 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. రంగారెడ్డి జిల్లాలో దాదాపు ధాన్యం కొనుగోలు ముగింపు దశకు చేరుకుంది. జిల్లాలో 2. 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా దానికి తగ్గట్టుగా 1.20 లక్షల మెట్రిక్ ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నారు.
80,000 పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం చేతికి రాగా మెజార్టీ రైతులు వివిధ కారణాల చేత దళారులకు విక్రయించారు. ప్రభుత్వం ఇప్పటివరకు పదిహేను వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మేడ్చల్ జిల్లాలో ఇప్పటివరకు మూడో వంతు మాత్రమే ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. జిల్లాలో యాసంగిలో 28 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించగా, ఇప్పటివరకు 9700 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు.
నల్లగొండ జిల్లాలో 5.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యానికి మించి 5.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 8.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువగా.. 5.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం 9.73 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటికీ ఇందులో 7 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కొనుగోలు చేయ గా, 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించారు. రైతుల నుంచి ఇంకా 2 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. మరో లక్ష టన్నుల ధాన్యం కాంటాలు పూర్తి చేసి, మిల్లులకు ఎగుమతి చేయాల్సి ఉంది.
మంచిర్యాల జిల్లాలో 3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం దిగుబడి రానుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 16.28 లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యం కొన్నారు. కు మ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లో వేసవికాలంలో సు మారుగా 56 వేల మెట్రిక్ ట న్నుల ధాన్యం వస్తుందని అ ధికారులు అంచనా వేశా రు. ఇప్పటివరకు 5,258 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు.
తరుముకొస్తున్న కాలం
అల్పపీడన ప్రభావం, నైరుతి రుతుపవనాలు కారణంగా ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు ఖరీఫ్ సీజన్‌కు సిద్ధమవుతున్నారు. రైతులు దుక్కులు దున్నుచుకొని వానకాలం పంటల సాగు కు సిద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల యా సంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండ టంతో ఖరీప్ సాగు పను లు వెనుకబడిపోతామని రై తులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే కురిసిన వర్షాలతో దుక్కులు దున్ని న భూములు చదును చేసుకుని విత్తనాలు వేసేందుకు సిద్ధం కావలసిన రైతులకు వరి ధాన్యం అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నా రు. రైతులే స్వయంగా కూలీలను మాట్లాడుకుని తూకం వే యించుకుంటున్నా రు.
కూలీలు, లారీ ల కొరత కారణం గా తూకం వేసిన ధాన్యం మి ల్లులకు వెళ్లకపోవడం, ట్యా బ్‌లో ఎంట్రీ కాక రైతులు ధాన్యం డ బ్బులు చేతికి అందే పరిస్థితి లేక ఇబ్బందు లు పడుతున్నా రు. ప్రభుత్వం ఇప్పటికైనా తేమ నిబం ధ నలు సడలించి ధా న్యాన్ని కొనాలని రైతులు కోరు తున్నారు. ధాన్యం డబ్బులు 24 గంటల్లోపు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.