07-01-2026 12:00:00 AM
ఎల్లారెడ్డి జనవరి 6 (విజయక్రాంతి) : ఎల్లారెడ్డి పట్టణంలోని 12 వార్డుల్లో మున్సిపల్ ఓటర్ జాబితాలో పలు సమస్యలు ఉన్నాయని అధికారులు క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎన్నికలకు ఆటం కలుగకుండా చూడాలని ఎల్లారెడ్డి బిజెపి మండల అధ్యక్షులు నర్సింలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు బత్తిని దేవేందర్, పలువురు భాజపా నాయకులు ఎల్లారెడ్డి ఆర్టీవో పార్థసింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. పదవ వార్డులో ఎన్నికల ఓటర్ లిస్ట్ లో అవకతవకలు ఉన్నాయని వాటిని సరిచేయాలని ఆర్డిఓకి ఇచ్చిన వివిధ పత్రంలో భాజపా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాజేష్ భాజపా నాయకులు మర్రి బాలకృష్ణ సతీష్ తదితరులు పాల్గొన్నారు.