19-08-2025 01:21:19 AM
- రైతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం లక్షా 13 వేల కోట్ల వ్యయం
- రైతులు ప్రస్తుత అవసరాల మేరకు మాత్రమే యూరియా కొనుగోలు చేయాలి
- పరిశ్రమలకు యూరియా డైవర్ట్ కాకుండా పటిష్ట చర్యలు
- యూరియా, ఎరువుల లభ్యతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి తుమ్మల.
- హాజరైన ఎస్పీ మహేష్ బి గితే
రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 18 (విజయక్రాంతి)వానాకాలం పంట సాగుకు అవసర మైన యూరియా రైతులకు చేరేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. సోమవారం మం త్రి తుమ్మల నాగేశ్వర రావు హైదరాబాద్ స చివాలయం నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కే.రామ కృష్ణ రావు, వ్యవసాయ కార్య దర్శి రఘునందన్ రావు లతో కలిసి యూ రియా, ఎరువుల లభ్యత పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీ క్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి ఎస్పీ మహేష్ బి గితే వ్యవసాయ అధికారులతో కలిసి పా ల్గొన్నారు. రాబోయే 45 రోజుల పాటు యూరియా సరఫరా పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.మండల స్థాయిలో స్టాక్ వివరాలు మానిటరింగ్ చేయాలని, ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి యూరియా తరలించాలని ప్రస్తుతం ప్రైవేటు డీలర్ల వద్ద 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అం దుబాటులో ఉందని, అది సక్రమంగా విక్ర యం జరగాలన్నారు..ప్రస్తుతం ఉన్న స్టాక్ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, పరిశ్రమలకు యూరియా డైవర్ట్ కావ డానికి వీలు లేదని, రైతులు అధికంగా స్టాక్ పెట్టుకోవద్దని, అవసరం మేరకే కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
యూరియాసరఫరా పై పత్రికలో వ్య తిరేక వార్తలు రాకుండా ముందస్తుగా పరిస్థితుల గురించి పాత్రికేయులకు వివరించాల న్నారు. యూరియా సరఫరా చేసేందుకు చే పట్టిన చర్యలు రైతులకు మీడియా ద్వారా తెలిసేలా చూడాలని వెల్లడించారు.అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు. జిల్లాలో యూరియా కేంద్రాల వద్ద యూరి యా పంపిణీ సమయాల్లో.అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏ ర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ మ హేష్ బి గితే తెలిపారు. ఎవరైనా అక్రమంగా యూరియా దాచిపెట్టిన వ్యవసాయేతర ప నులకు వాడిన వారి సమాచారం వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అందించాలని సూచించారు.యూరియా అక్రమ రవాణా జరగకుండా జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు.సమావేశంలో జి ల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా సహకార అధికారి తదితరులు పాల్గొన్నారు.