calender_icon.png 19 August, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల

19-08-2025 01:22:48 AM

కొత్తపల్లి, ఆగష్టు 18(విజయాక్రాంతి):సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ రూరల్ మండలం చర్ల బూత్కూర్ గ్రామంలో కౌండిన్య యువత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని సోమవారం రోజున కౌండిన్య యువత సభ్యులు మరియు చర్ల భూత్కూర్ గ్రామ గౌడ కులస్తులతో కలిసి సర్వాయి పాపన్న విగ్రహాన్ని మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులు అర్పించి, మాట్లాడుతు పోరాట యోధుడు, పేద, పీడిత ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసారని అన్నారు.

ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, చర్ల బూత్కూరు మాజీ సర్పంచ్ ధబ్బెట రమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, దుర్షేడ్ మాజీ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్ రావు,బిఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కూర శ్యామ్ సుందర్ రెడ్డి,కౌండిన్య యువత అధ్యక్షులు జక్కు అజయ్ గౌడ్, ఉపాధ్యక్షుడు బుర్ర ప్రణయ్ గౌడ్, కార్యదర్శి మూల బలరాం గౌడ్, కౌండిన్యూ యూత్ సభ్యులు వడ్లకొండ చందు, బుర్ర శ్రీకాంత్, కొట్టేపల్లి శ్రీనివాస్, గౌడ సంఘం కులపెద్ద మూల లక్ష్మిరాజం గౌడ్ తోపాటు గౌడ సంఘం కులస్తులు, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు,పెద్ద ఎత్తున గ్రామస్తులుపాల్గొన్నారు.