24-07-2025 04:42:09 PM
నిర్మల్ (విజయక్రాంతి): శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మహారాష్ట్రలోని భద్ర మారుతి హనుమాన్ ఆలయం గణేశ్వర జ్యోతిర్లింగ ఆలయానికి ప్రత్యేక బస్ సర్వీసు ఏర్పాటు చేయడం జరిగిందని నిర్మల్ డిఎం పండరీ(Nirmal DM Pandari) తెలిపారు. నిర్మల్ డిపో ద్వారా లగ్జరీ బస్సు నిర్మల్ బైంసా నాందేడ్ ఔరంగాబాద్ మీదుగా ఈ యాత్ర స్థలాలకు తీసుకెళ్లి తిరిగి వస్తుందని తెలిపారు. పెద్దలకు 2000 వేల రూపాయలు చార్జి, పిల్లలకు 1200 చార్జి ఉంటుందని వివరించారు. తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే వారు టీజీ ఆర్టీసీ నిర్మల్ బస్ స్టేషన్ కౌంటర్లు సంప్రదించాలని ఇతర వివరాలకు 99592 26003, 83280 21517 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇతర వివరాలకు డిపో మేనేజర్ ను వివరాలను అడిగి తెలుసుకోవచ్చని వారు పేర్కొన్నారు.